స్వగ్రామం చేరిన వలసజీవి మృతదేహం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): స్వగ్రామంలో ఉపాధి లేక గల్ఫ్ దేశానికి వెళ్లిన వలస జీవి అక్కడే గుండెపోటుతో మృతిచెందగా.. 20 రోజులకు శుక్రవారం మృతదేహం వచ్చింది. ఎల్లారెడ్డిపేట మండలం గుంటపల్లి చెరువు తండాకు చెందిన గిరిజన రైతు గుగులోతు రవి(45) రెండేళ్ల క్రితం సౌదీ అరేబియాకు వెళ్లాడు. ఈనెల 6న పనిచేస్తుండగానే గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. రవి మిత్రులు కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతదేహాన్ని తెప్పించేందుకు మాజీ మంత్రి కేటీఆర్ ప్రయత్నించారు. దాదాపు 20 రోజుల తర్వాత రవి మృతదేహం స్వగ్రామానికి చేరింది. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, మాజీ జెడ్పీటీసీ చీటి లక్ష్మణరావు, తిమ్మాపూర్ సర్పంచ్ అందె సుభాష్ తదితరులు నివాళి అర్పించారు. మృతునికి భార్య మంజుల, కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
గుంటపల్లిచెరువుతండాలో విషాదం
స్వగ్రామం చేరిన వలసజీవి మృతదేహం


