రూటు మార్చిన టైగర్
మంథనిరూరల్: వారం పది రోజులుగా రామగుండం ఓసీపీ ప్రాంతంలో మకాం వేసి రెండు రోజుల క్రితం గోదావరినది దాటిన పెద్దపులి శుక్రవారం తిరిగి నది దాటి పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతం నుంచి గోదావరినది దాటిన పులి మంచిర్యాల జిల్లా శ్రీ రాంపూర్ ప్రాంతం నుంచి గోదావరిఖని వైపు వ చ్చింది. అక్కడి నుంచి మూసివేసిన మేడిపల్లి ఓసీపీ డంప్ 1లో మకాం వేసింది. పది రోజుల పాటు ఆ ప్రాంతంలోనే సంచరించగా అటవీ శాఖ అధికారులు పులి సంచరిస్తున్నట్లు గుర్తించి సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఓసీపీ ప్రాంతాలు సేఫ్‌గా భావించని పులి తిరిగి మంచిర్యాల ఇందా రం మీదుగా ఫారెస్ట్‌లోకి వెళ్లినట్లు అటవీ శాఖ అధి కారులు గుర్తించారు. వారం పది రోజుల పాటు పు లి కదలికలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు గోదావరి నది దాటి వెళ్లిన ఆనవాళ్లు కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే తిరిగి శుక్రవా రం పులి నది దాటిందన్న సమచారం తెలుసుకున్న సెక్షన్ ఆఫీసర్ అఫ్జల్ అలీ, బీట్ ఆఫీసర్లు ప్రదీప్, రాంసింగ్‌లు గాలింపు చర్యలు చేపట్టగా మంథని మండలం ఆరెంద ఖాన్‌సాయిపేట ప్రాంతం నుంచి నది దాటినట్లు అధికారులు గుర్తించారు. శివ్వారం మీదుగా ఎల్ మడుగు దాటి ఇవతలి వైపు వచ్చిన ట్లు అడుగులను గుర్తించారు. సాయంత్రం వరకు ఎటు వైపు వెళ్లిందోనని ఫారెస్ట్ అధికారులు గాలించగా ఆరెంద, ఖాన్‌సాయిపేట, భట్టుపల్లి అటవీప్రాంతంలోకి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. పెద్దపులి గో దావరినది దాటి ఇవతలి వైపు వచ్చిందనే ప్రచారం జరుగడంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో అటవీ శాఖ అధికారులు సైతం ఆయా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ అడవిలోకి వెళ్లవద్దని, పులికి హాని కలిగించే చర్యలకు పాల్పడొద్దని హెచ్చరిస్తున్నారు.
ఆరెంద వైపు వచ్చినట్లు ఆనవాళ్లు
గోదావరితీరంలో అడుగుల గుర్తింపు
గాలింపు చర్యల్లో అటవీ అధికారులు


