
రాజన్నకు ‘పంద్రాగస్టు’ రద్దీ
మహాలక్ష్మి ఆలయంలో హోమం నిర్వహిస్తున్న అర్చకులు
సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు ప్రసాదం అందజేస్తున్న మహేశ్
ఆలయంలో భక్తులు
వేములవాడ: వేములవాడ రాజన్నను శుక్రవారం 50 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ఆగస్టు 15 సందర్భంగా రద్దీ నెలకొంది. ధర్మగుండంలో స్నానాలు చేసి రాజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల ఏర్పాట్లను ఆలయ ఈవో రాధాభాయి, ఏఈవోలు, పర్యవేక్షకులు పరిశీలించారు. కాగా.. రాజన్నను దసరా సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆశీర్వాదం అందించారు. ప్రొటోకాల్ సీనియర్ అసిస్టెంట్ బొడుసు మహేశ్‌స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదం అందజేశారు.
ప్రత్యేక హోమాలు
రాజన్న ఆలయ అనుబంధ మహాలక్ష్మి ఆలయంలో శ్రావణమాసం శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక హోమాలు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం, పట్టుచీర సమర్పించారు. శ్రావణశుక్రవారం సందర్భంగా అర్చకులు రాజేశ్వరశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాజన్నకు ‘పంద్రాగస్టు’ రద్దీ

రాజన్నకు ‘పంద్రాగస్టు’ రద్దీ