
గ్రామ స్వరాజ్య కృషీవలుడు వాజ్‌పేయ్
కరీంనగర్‌టౌన్: ప్రజాస్వామ్య ఫలాలను అట్టడుగునున్న పేదవాడి వరకు తీసుకెళ్లాలనే శ్యామాప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలను, సిద్ధాంతాలను అమలు చేసిన గొప్ప నాయకుడు వాజ్‌పేయ్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయ్ వర్ధంతి సందర్భంగా శనివారం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ రెండు ఎంపీ సీట్లకే పరిమితమైన బీజేపీని అలుపెరగని పోరాటం చేసి ప్రభుత్వంలోకి తీసుకురావడంతో పాటు మూడుసార్లు ప్రధాని పదవిని చేపట్టారని గుర్తు చేశారు. అణుబాంబు తయారు చేసి అగ్రదేశాలకు వణుకు పుట్టించిన ధీశాలి అని కొనియాడారు.