
గోపాల.. గోపాల
కరీంనగర్ కల్చరల్/జమ్మికుంట: జిల్లావ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు శనివారం వైభవంగా జరుపుకున్నారు. చిన్నారులు రాధాకృష్ణ, గోపికల వేషధారణతో సందడి చేశారు. నగరంలోని సాయినగర్ మురళీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజలు, సాయంత్రం శోభాయాత్ర నిర్వహించారు. 108 రకాల ప్రసాదాలు సమర్పించారు. పలుప్రాంతాల్లో ఉట్టి సంబురాలు జరుపుకు న్నారు. జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌక్‌వద్ద నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో మ ల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, హుజూరా బాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు. ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించి విజేతలకు బహుమతులు ఇచ్చారు.