కొనసాగుతున్న ఎత్తిపోతలు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ఎత్తిపోతలు

Aug 17 2025 6:52 AM | Updated on Aug 17 2025 6:52 AM

కొనసా

కొనసాగుతున్న ఎత్తిపోతలు

యూరియా తంటాలు వానర విహారం

రామడుగు: రామడుగు మండలం లక్ష్మీపూర్‌ గాయత్రి పంపుహౌజ్‌ నుంచి ఐదు మోటార్ల ద్వారా నీటిని ఎత్తి పోసి గ్రావిటీ కాలువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు 1.1 టీఎంసీ మిడ్‌ మానేరుకు పంపింగ్‌ చేశారు. 1,2,4,5,6 బాహుబలి మోటార్ల ద్వారా ఎత్తి పోస్తున్నట్లు అధికారులు తెలిపారు.

‘కాళేశ్వరం’పై సీఎంవి పచ్చి అబద్ధాలు

రామడుగు: కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వాతంత్య్రదినోత్సవం రోజున పచ్చి అబద్ధాలు మాట్లాడడం సరికాదని, కాళేశ్వరం నీటినే ఇప్పుడు గాయత్రి పంపుహౌజ్‌ నుంచి ఎత్తిపోస్తున్నారని మాజీ ఎంపీ బి.వినో ద్‌కుమార్‌ విమర్శించారు. రామడుగు మండలంలోని లక్ష్మీపూర్‌ గాయత్రి పంపుహౌజ్‌ నుంచి నీటిని గ్రావిటీ కాలువలోకి తరలిస్తుండడంతో శనివారం పరిశీలించి, పూజలు చేశారు. రూ.80వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించామని, కేవలం మూడు పిల్లర్లు కుంగిపోతే ప్రాజెక్టు మొత్తం గంగపాలైందని రేవంత్‌రెడ్డి విమర్శించడం సరికాదన్నారు. కుంగిన పిల్ల ర్లకు మరమ్మతు చేయకుండా రాజకీయం చే యడం ఏంటని విమర్శించారు. మాజీ ఎమ్మె ల్యే సుంకె రవిశంకర్‌, నారదాసు లక్ష్మణ్‌రావు, రామడుగు సింగిల్‌ విండో చైర్మన్‌ వీర్ల వేంకటేశ్వర్‌రావు, బీఆర్‌ఎస్‌ మండల ఆధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

శంకరపట్నం: మండలంలోని గద్దపాక సహకార సంఘం పరిధిలో ఉన్న కాచాపూర్‌ గోదాం వద్ద శనివారం యూరియా కోసం రైతులు క్యూకట్టారు. యూరియా లోడ్‌ రావడంతో పెద్ద సంఖ్యలో గోదాంకు చేరుకున్నారు. ఆధార్‌ జిరాక్స్‌తో క్యూ కట్టడంతో కాసేపటికే వచ్చిన లారీ యూరియా అయిపోయిందని, మరో లారీ యూరియా తెప్పించి పంపిణీ చేస్తామని సిబ్బంది చెప్పడంతో వాగ్వివాదానికి దిగారు. క్యూలో ఉన్న రైతులకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివారం మరోలారీ యూ రియా తెప్పించి రెండు బస్తాలు పంపిణీ చేస్తామని చెప్పడంతో రైతులు ఇంటిదారి పట్టారు.

వీణవంక: వర్షం కాస్త గెరువిచ్చిందని ఆరుబయట ధాన్యం ఆరబోస్తే కోతుల గుంపు అందినకాడికి లూటీ చేశాయి. పదుల కొద్ది కోతులు గుంపుగా దండయాత్ర చేయడంతో సదరు రైతు చేతులెత్తాశాడు. వీణవంక మండలం బేతిగల్‌ గ్రామంలో ఓ రైతు సన్నరకం ధాన్యాన్ని ఇంటి ముందు ఆరబోశాడు. అప్పటి వరకు కాపలా ఉండి భోజనం కోసం ఇంట్లోకి వెళ్లేలోపే కోతులు ధాన్యాన్ని చిందరవందర చేశాయి. సుమారు గంట పాటు ఆరగించాయి. చివరికి రైతు టపాసులు పేల్చడంతో కోతుల గుంపు అక్కడి నుంచి వెళ్లిపోయింది.

కొనసాగుతున్న ఎత్తిపోతలు1
1/3

కొనసాగుతున్న ఎత్తిపోతలు

కొనసాగుతున్న ఎత్తిపోతలు2
2/3

కొనసాగుతున్న ఎత్తిపోతలు

కొనసాగుతున్న ఎత్తిపోతలు3
3/3

కొనసాగుతున్న ఎత్తిపోతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement