
ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్దాం
పోటీ ప్రపంచంలో దొరికే కొద్దివిరామ సమయాన్ని పబ్బులు, రెస్టారెంట్లు, పార్కులకు కేటాయిస్తున్నారు. వీటితో కలిగే ప్రయోజనం కన్నా ఇబ్బందులే ఎక్కువ. అలా కాకుండా ఆధ్యాత్మికతను అందిపుచ్చుకుందాం. ఇష్టదైవారాధన కోసం ప్రార్థనా మందిరాలకు వెళ్దాం. అక్కడ ఓ పూట ఆనందంగా గడుపుదాం. పెద్దల సందేశాలను మన జీవితాలకు అన్వయించుకుందాం. తోటి భక్తుల్లోని మంచిని స్వీకరిద్దాం.
ఒక అధ్యయనం ప్రకారం.. ప్రతీ ముగ్గురిలో ఇద్దరు అదే పనిగా ఫోన్ వినియోగిస్తుండగా వారిలో 11శాతం మంది సెల్‌కు బానిసలవుతున్నారు. ఇది అనేక సమస్యలకు కారణమవుతోంది. ఆదివారం ఫోన్‌ను పక్కన పెడదాం. పుస్తక పఠనం లేదా దినపత్రికను పూర్తిగా చదువుదాం. ఒక రోజులో 30 పేజీలకు తక్కువ కాకుండా చదివితే జ్ఞానంతోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. దినపత్రికలు చదవడంతో నిత్యనూతనంగా.. హుషారుగా పనిచేస్తాం.

ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్దాం