
ప్రభుత్వ భూమి ఆక్రమణకు యత్నం
కొడిమ్యాల(చొప్పదండి): మండలంలోని కోనాపూర్ గ్రామంలో సర్వే నం.192,348లో ప్రభుత్వ భూమిని చదును చేసి ఆక్రమించేందుకు అదే గ్రామానికి చెందిన కొందరు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న ఆర్‌ఐ కరుణాకర్, మండల సర్వేయర్ తిరుపతి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అశ్విని అడ్డుకున్నారు. గతంలో 192 సర్వే నంబర్ గల భూమిని సూరంపేట గ్రామంలోని ఓ వ్యక్తి ఆక్రమించి చదును చేస్తుండగా పట్టుకొని రెండు బ్లేడు ట్రాక్టర్లను సీజ్ చేశామని, ఆక్రమణకు పాల్పడ్డ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే ఆక్రమణకు పాల్పడ్డ వ్యక్తి వరినాట్లు వేశాడని తెలిసింది. మరోసారి 192 సర్వే నంబర్ గల భూమి తెరమీదకు రావడంతో అధికారుల నామమాత్రపు చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారుల నామమాత్రపు చర్యలు