
నగరంలో కోతుల బీభత్సం
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ధన్గరివాడి పాఠశాలలో కోతుల భయంతో ఓ విద్యార్థి దూకి గాయపడిన ఘటన మరవకముందే, మంగళవారం నగరంలోని రజ్విచమాన్ ప్రాంతంలో ఓ కార్మికుడు తీవ్రగాయాలపాలయ్యాడు. కాలనీలో ఓ భవన నిర్మాణంలో భాగంగా పై అంతస్తులో పనిచేస్తుండగా, 20కి పైగా కోతులు ఒక్కసారిగా ఆ భవనంపైకి వచ్చాయి. కోతులు దాడికి ప్రయత్నించడంతో, భయంతో రామరాజు అనే కార్మికుడు భవనంపై నుంచి కిందికి దూకాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన రామరాజును, స్థానికులు వెంటనే ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. కాగా రామరాజు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నగరంలో కోతులబెడద తీవ్రంగా ఉందని, అధికారులు చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.
ముదిరాజ్ పౌరుల సమితి ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడిగా అనిల్‌కుమార్
సిరిసిల్లటౌన్: తెలంగాణ ముదిరాజ్ పౌరుల సమితి ఉద్యోగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా రాజన్నసిరిసిల్లకు చెందిన కర్నాల అనిల్‌కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ముదిరాజ్ పౌరుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుంకరబోయిన మహేశ్‌ముదిరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పరవేణి రంజిత్ ముదిరాజ్‌లు నియమితులయ్యారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంజిత్, నీలం మధు ముదిరాజ్‌లకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో పండుగ స్వామి, శ్రీధర్, రాకేశ్, నరేశ్, సాయి పాల్గొన్నారు.
చెడు వ్యసనాలతోనే
యువతలో హార్ట్‌ఎటాక్
కరీంనగర్‌టౌన్: ఆల్కహాల్, స్మోకింగ్, డ్రగ్స్, ఒత్తిడి కారణంగానే వయస్సుతో సంబంధం లేకుండా హార్ట్‌ఎటాక్‌లు పెరుగుతున్నాయని మెడికవర్ కార్డియాక్ విభాగం వైద్యులు అన్నారు. మంగళవారం కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రిలో గుండె వ్యాధులపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. జీవనశైలిలో మార్పుల కారణంగా 45 ఏళ్ల తర్వాత రావాల్సిన గుండె జబ్బులు 25 ఏళ్లలోపు యువతకు సైతం వస్తున్నాయన్నారు. ఛాతినొప్పి, గుండెదడ, ఆయాసం, చేయి, దవడ గుంజడం, లూజ్ మోషన్స్ వంటివి హార్ట్‌ఎటాక్ లక్షణాలన్నారు. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు, ఫ్యామిలీ హిస్టరీ, కొలెస్ట్రాల్ వంటి సమస్యలుంటే సైలెంట్ ఎటాక్ వచ్చే ప్రమాదముందన్నారు. కడుపులో మంట వస్తే గ్యాస్ అని భావించకుండా వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. కోవిడ్‌కు హార్ట్ ఎటాక్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. షుగర్, బీపీని తగ్గించుకొని, చెడు అలవాట్లుతో పాటు కల్తీ ఆయిల్ మానేయాలన్నారు. ఆహారపు అలవాట్లను మార్చుకొని, రోజూ గంటపాటు వ్యాయామం చేసి ఒత్తిడిని తగ్గించుకుంటే హార్ట్‌ఎటాక్‌ను జయించవచ్చన్నారు. మెడికవర్ సెంటర్‌హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో వైద్యులు అనీశ్‌పబ్బ, వాసుదేవరెడ్డి, రాజేంద్రప్రసాద్, ఉపేందర్‌రెడ్డి, నాగరాజు, విష్ణువర్ధన్‌రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రియాంక, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్ పాల్గొన్నారు.

నగరంలో కోతుల బీభత్సం

నగరంలో కోతుల బీభత్సం