
గ్రామంలోకి వన్యప్రాణి
కొడిమ్యాల(చొప్పదండి): మండలంలోని కోనాపు రం గ్రామంలో మంగళవారం వన్యప్రాణి అయిన మనుబోతు గాయాలతో కనిపించింది. గ్రామస్తులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా, కొడిమ్యాలలోని ప్రాథమిక వెటర్నరీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం అటవీశాఖ అధికారి మోయినొద్దీన్ మాట్లాడుతూ, రేస్ కుక్కల దాడిలో మనుబోతు గాయపడిందని, వాటి నుంచి తప్పించుకొని గ్రామ శివారులోకి వచ్చినట్లు తెలిపారు. ప్రాథమిక చికిత్స చేయించి , ఆరోగ్యంగా ఉన్నందున మళ్లీ అడవిలో వదిలిపెట్టినట్లు పేర్కొన్నారు.