
ఆలేరులో విషాదం
ఆలేరు: ఉన్న ఊరు, కన్నవారిని వదిలి బతుకుదెరువు కోసం వలస వెళ్లిన కార్మికుడి మృతి బాధిత కుటుంబంలో విషాదం నింపింది. గోదావరిఖని ప్రాంతానికి చెందిన సదానందం(48) ఉద్యోగ రీత్యా భార్య అఖిల, ఇద్దరు కుమారులు శ్రీరామ్, శ్రీనాథ్‌తో కలిసి ఆలేరులో స్థిరపడ్డాడు. మైత్రికాలనీలో నివాసం ఉంటున్నాడు. దాదాపు 25ఏళ్లుగా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. సదానందం కుమారులిద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. కార్మిక యూనియన్‌లోనూ చురుకుగా వ్యవహరించే సదానందం మంగళవారం కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందడంతో మైత్రి కాలనీలోని ఆయన ఇంటి వద్ద విషాదం అలుముకుంది. ఆలేరులో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
డ్యూటీ షిఫ్ట్ ఛేంజ్?
సదానందం మంగళవారం మధ్యాహ్నం డ్యూటీకి వెళ్లాల్సి ఉండగా, ఉదయం షిఫ్ట్‌కి మార్చుకున్నట్లు తెలిసింది. అయితే యూనియన్ సమావేశానికి హాజరుకావాలనే ఆలోచనతో ఉదయం షిఫ్ట్‌కు హాజరైనట్లు సమాచారం.