
మద్యం మత్తులో యువకుడి వీరంగం
వేములవాడ: మద్యం మత్తులో యువకుడు వీరంగం సృష్టించాడు. పట్టణంలోని నటరాజ్ విగ్రహం వద్ద ఓ యువకుడు మద్యం మత్తులో అకస్మాత్తుగా వచ్చి టిఫిన్ సెంటర్‌పై రాళ్లు విసిరాడు. వంట పనిముట్లను చిందరవందరగా పడేశాడు. దీంతో అక్కడ టిఫిన్ చేస్తున్న కస్టమర్లు పరుగులు తీశారు. టిఫిన్ సెంటర్ నిర్వహుకుడు శ్రీనివాస్‌పై దాడికి పాల్పడ్డాడు. గమనించిన టిఫిన్ సెంటర్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై యువకుడిని తాళ్లతో స్తంభానికి కట్టేసి ఇతరులపై దాడి చేయకుండా అడ్డుకున్నారు. వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు అప్పగించారు.
సీఐల బదిలీ
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రెండు సర్కిళ్ల సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తిమ్మాపూర్ సీఐగా జి.సదన్‌కుమార్ నియమితులయ్యారు. అక్కడ పనిచేస్తున్న కె.స్వామి ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయనున్నారు. హుజూరాబాద్ సీఐగా కరుణాకర్ బదిలీకాగా.. అక్కడ పనిచేస్తున్న గుర్రం తిరుమల్ ఐజీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.