
లక్ష్మణమూర్తిని సన్మానిస్తున్న డీఈవో
సప్తగిరికాలనీ(కరీంనగర్): ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని జిల్లా విద్యాశాఖ అధికారి సీహెచ్ జనార్దన్‌రావు అన్నారు. శుక్రవారం నగరంలోని సుభాష్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న అల్లాడి లక్ష్మణమూర్తి ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా లక్ష్మణమూర్తి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఖాజా నజీరొద్దీన్, మండల విద్యాధికారి మధుసూదనాచారి, గోగులకొండ మోహన్, కటకం రమేశ్, గాజుల రవీందర్, మోతె చంద్రశేఖర్‌రెడ్డి, జాన్ సుధాకర్, రాజిరెడ్డి, మహేందర్ రెడ్డి, ప్రభాకర్‌రావు, ఖాజా మంజూర్ అలీ, అశోక్ రావు తదితరులు, పాల్గొన్నారు.