యువతి బ్లాక్‌ మెయిల్‌తో.. యువకుడు తీవ్ర నిర్ణయం..! | - | Sakshi
Sakshi News home page

యువతి బ్లాక్‌ మెయిల్‌తో.. యువకుడు తీవ్ర నిర్ణయం..!

Mar 28 2024 12:05 AM | Updated on Mar 28 2024 9:25 AM

- - Sakshi

రాజశేఖర్‌రెడ్డి(ఫైల్‌)

కరీంనగర్‌: కరీంనగర్‌ తీగల వంతెన వద్ద సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్‌కు చెందిన దూది రాజశేఖర్‌రెడ్డి (28) బుధవారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు ఓ యువతి కారణమంటూ సూసైడ్‌ నోట్‌ రాశాడు. ఆరేళ్లుగా కరీంనగర్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డికి ఇటీవల పెళ్లి సంబంధం చూశామని తండ్రి దూది రఘుపతిరెడ్డి తెలిపారు.

అయితే అదే హోటల్‌లో పనిచేస్తున్న ఓ యువతి బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ తన కుమారుడిని పెళ్లి చేసుకోకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు. ఈ నెల 23న నలుగురు వ్యక్తులతో కలిసి మల్లాపూర్‌ గ్రామానికి వచ్చి పరువు తీసిందని ఆరోపించారు. మళ్లీ గ్రామానికి వస్తానని బెదిరించడంతో పరువు పోతుందనే భయంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇవి చదవండి: హత్య చేసింది ‘తమ్ముడే’

Advertisement
 
Advertisement
Advertisement