కరీంనగర్‌లో శ్రీవేంకటేశ్వర స్వామివారికి పూజలు
జమ్మికుంట శ్రీవేంకటేశ్వర ఆలయంలో భక్తుల పూజలు
మార్కెట్ రోడ్డు ఆలయంలో స్వామివారి దర్శనానికి బారులుతీరిన భక్తులు
కరీంనగర్‌కల్చరల్/జమ్మికుంట/తిమ్మాపూర్: తొలి ఏకాదశి సందర్భంగా శనివారం జిల్లావ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజామన నుంచే భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఉపవాస దీక్షలు ఆచరిస్తూ విష్ణు సహస్రనామ పారాయణం, భజనలు చేశారు. నగరంలోని మార్కెట్ రోడ్డు వేంకటేశ్వరాలయంలో సందడి నెలకొంది. జమ్మికుంట శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో హరికృష్ణామాచార్యులు, వేణుగోపాలచార్యుల అధ్వర్యంలో స్వామివారికి తులసి, మల్లె మాలలతో అలంకరించి, అభిషేకం నిర్వహించారు. ఈవో సుధాకర్, ఆలయ ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్, గంగాధర్, సిబ్బంది గుడికాడి శ్రీనివాస్ పాల్గొన్నారు.


