కరీంనగర్ కార్పొరేషన్: నిర్మాణ పనుల నాణ్య తలో రాజీపడొద్దని మేయర్ కొలగాని శ్రీనివా స్ అధికారులను ఆదేశించారు. మార్కెట్లు, కాంప్లెక్స్‌లు, ఇతర భవనాలు నిర్ణీత గడువులోగా అందుబాటులోకి తేవాలన్నారు. నగరంలో నిర్మాణంలో ఉన్న సమీకృత మార్కెట్లు, ఐసీడీఎస్ భవనం, పార్కింగ్, షాపింగ్ కాంప్లెక్స్ పనులను శనివారం తనిఖీ చేశారు. పద్మనగర్ సమీకృత వెజ్,నాన్‌వెజ్ మార్కెట్‌ను సందర్శించారు. మార్కెట్ నిర్వహణను మెరుగుపరచాల ని సూచించారు. కాశ్మీర్‌గడ్డ సమీకృత మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించి, నెల రోజుల్లోగా ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం ఎదురుగా నిర్మాణంలో ఉన్న సమీకృత మార్కెట్ పనులను తనిఖీ చేశారు. మూడు నెలల్లో ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. ఐసీడీఎస్ భవనం, పార్కింగ్, షాపింగ్ కాంప్లెక్స్ పనులు పరిశీలించారు. భవన నిర్మాణ నాణ్యత, పార్కింగ్ సౌకర్యాలు, షాపింగ్ కాంప్లెక్స్ రూపకల్పన, విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, పారిశుధ్యం, భద్రతా ప్రమాణాలు, ప్రజలకు అవసరమైన వసతులపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో డి ప్యూటీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, నగరపాలకసంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఈఈ లచ్చిరెడ్డి, డీఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
చెత్త వేస్తే రూ.5వేల జరిమానా
కొత్తపల్లి: కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌లో ఓ ఇంటి యజమానికి రూ.5 వేల అపరాధ రుసుం పడింది. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 21 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు జరుగుతున్న ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాల్లో భాగంగా తనిఖీలు చేపడుతున్న పంచాయతీ కార్యదర్శి జున్నుతుల రేవంత్‌రెడ్డికి ఓ ఇంటి సమీపంలో విపరీతమైన చెత్త కనిపించింది. ఇంటి యజమాని ఎనుపోతుల మల్లేశానికి నోటీసు జారీ చేసి, శనివారం పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం సెక్షన్ 78, 87 ప్రకారం రూ.5 వేల జరిమానా విధించారు. గృహ అనుమతి పత్రాన్ని సమర్పించాలని నోటీసులో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వా రిపై ఇకముందు కూడా కఠిన చర్యలు తీసుకుని జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.
జాతీయ పోటీలకు శ్రీరామ్
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్ జిల్లాకు చెందిన యువ హాకీ క్రీడాకారుడు సంఘ శ్రీరామ్ జాతీయస్థాయి జూనియర్స్ హాకీ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 28 నుంచి ఆగస్టు 6 వరకు చైన్నెలో జరగనున్న ఈ పోటీలలో తెలంగాణ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఇటీవల గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన శ్రీరామ్ జాతీయపోటీలకు ఎంపికయ్యాడు. జిల్లా, రాష్ట్ర హాకీ అసోసియేషన్ బాధ్యులు రవీందర్‌సింగ్, సురేందర్‌సింగ్, కల్యాణి, మహమ్మద్ అన్వర్, కాలీద్ హర్షం వ్యక్తం చేశారు.


