జైలులో ఖైదీలకు చదువు నేర్పిస్తున్నాం. చాలా మంది వివిధ నేరాల్లో జైలు వచ్చేటప్పుడు వేలిముద్రలు వే యడం గమనిస్తాం. అలాంటి వారికి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి సంతకం చేయడంతో పాటు చిన్నచిన్న విషయాలు నేర్పిస్తాం. వేలిముద్రతో వచ్చిన వారు విడుదలై వెళ్లేప్పుడు జైలుపత్రాల్లో సంతకం చేయడం చూస్తే సంతోషం అనిపిస్తుంది.
– విజయ్‌దేని,
జైలు సూపరింటెండెంట్, కరీంనగర్
నేను సదువుకోలేదు. గతంలో ఎక్కడ అయినా వేలుముద్ర వేసేటోన్ని. జైళ్లో సార్లు చెప్పిన సదువుతో నాకు సంతకం పెట్టడం వచ్చింది. విడుదలయ్యేటప్పుడు సంతకం పెట్టి బయటకు వచ్చాను. చదువురాని వారందరికీ సంతకం పెట్టడం, అనేక విషయాలు నేర్పుతున్నారు.
– తిరుపతి, వేములవాడ


