కరీంనగర్ కార్పొరేషన్: విద్యార్థుల ఉద్యమంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దిగొచ్చిందని కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్ అన్నారు. శనివారం నగరంలోని రాజీవ్‌చౌక్ నుంచి కార్ఖానగడ్డలోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో క్యాండిల్ మార్చ్ నిర్వహించారు. అంజన్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి ఉద్యమ నైతిక విజయమన్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, ఏఎంసీ చైర్మన్ ఆకుల నర్సయ్య, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, వుట్కూరి నరేందర్ రెడ్డి, మల్లికార్జున రాజేందర్, గడ్డం విలాస్‌రెడ్డి, మడుపు మోహన్, కర్ర సత్య ప్రసన్నరెడ్డి, కర్ర రాజశేఖర్, చాడగొండ బుచ్చిరెడ్డి, సరిళ్ల ప్రసాద్, వరాల నర్సింగం, పర్వత మల్లేశం పాల్గొన్నారు.


