
కోరా పాఠశాల విద్యార్థులు
కరీంనగర్: పెద్దపెల్లి జిల్లా యైటింక్లయిన్‌కాలనీ అంబేద్కర్ స్టేడియంలో జరిగిన డాడ్జ్ బాల్ టోర్నమెంట్‌లో కరీంనగర్ జిల్లా కోరా ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరచడంతో పాటు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కౌశిక్, రిషి, అభినయ్, అక్షితీసాయి, గీతిక, శ్రీనిధి, హారిక, పూజితను పాఠశాల చైర్మన్ మహిపాల్‌రెడ్డి, డైరెక్టర్లు వరప్రసాద్, రాంరెడ్డి, సింహాచలం హరికృష్ణ, వంగళ సంతోష్‌రెడ్డి పుష్పగుచ్ఛంతో అభినందించారు. శిక్షణ ఇచ్చిన పీఈటీ దుర్గరాజు, విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు.