
ఘటన స్థలంలో సత్తయ్య మృతదేహం
ముస్తాబాద్(సిరిసిల్ల): కూతురు పెళ్లికి చేసిన అప్పు చెల్లించి ఇంటికి వస్తున్న ఓ తండ్రి రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన ఘటన విషాదం నింపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌కు చెందిన సింగరవేణి సత్తయ్య (50) గత నెల 23న తన ఒక్కగానొక్క కూతురు మనీషా వివాహాన్ని ఘనంగా జరిపించాడు. కూతురు పెళ్లికి చేసిన అప్పు తీర్చేందుకు శనివారం అల్మాస్‌పూర్ నుంచి కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం మోతే గ్రామానికి బైక్‌పై బయలుదేరాడు. మోతే గ్రామంలో అప్పు చెల్లించి ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. సత్తయ్య మృతితో భార్య, కూతురు, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. వారం క్రితమే కూతురు పెళ్లి చేసి అంతలోనే రోడ్డు ప్రమాదంలో సత్తయ్య మృతిచెందడంతో అల్మాస్‌పూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. రాజన్న సిరిసిల్ల జిల్లావాసి దుర్మరణం

సత్తయ్య (ఫైల్)