
ఫిషరీష్ గురించి వివరిస్తున్న రాజు
కరీంనగర్ సిటీ: ఫిషరీష్ అధ్యయనంతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుంటుందని ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల జంతుశాస్త్ర విభాగం అధ్యాపకుడు పర్లపల్లి రాజు తెలిపారు. స్థానిక ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాల స్వతంత్ర ప్రతిపత్తిలో జంతుశాస్త్ర విభాగంలోని ఫిషరీస్ విద్యార్థులు కళాశాలలో గల నర్సరీ పాండులో చెన్నాస్ట్రేటర్స్ చేప పిల్లలను అధ్యాపకులతో కలిసి వదిలిపెట్టారు. ఆక్వా కల్చర్, ఆక్వా ఎక్స్పోర్ట్, ఓషోగ్రఫీ మెరిన్ బయో టెక్నాలజీ రంగాల్లో ఫిషరీస్ విద్యార్థులకు బాగుంటుందని తెలిపారు. పీజీ ఆ తరువాత పరిశోధన వైపు ముందుకెళ్లాలని సూచించారు. డాక్టర్ కె.సురేందర్‌రెడ్డి, జీసీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి.మహేశ్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి బి.సురేష్‌కుమార్, అధ్యాపకులు సుమలత, సమత, రవళి పాల్గొన్నారు.