
సాక్షి, కరీంనగర్‌డెస్క్:
నియోజకవర్గాల పునర్విభజనకు ఆమోదముద్ర పడి సరిగ్గా 15 ఏళ్లవుతోంది. మారిన సెగ్మెంట్ల హద్దులతో నేతల తలరాత మారిపోయింది. కొంతమంది కొత్తగా ఏర్పడిన అసెంబ్లీ నియోజకవర్గాలకు మారాల్సి వచ్చింది. రిజర్వేషన్లలో స్వల్ప మార్పులు జరగడంతో ఆయా కేటగిరీకి చెందిన నేతలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. విభజన ఫలితంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో 6 కనుమరుగయ్యాయి. వాటి స్థానంలో కొత్తవి ఆవిర్భవించాయి.
2008లో ఆమోదం..
2001 జనాభా లెక్కల ఆధారంగా అప్పటికే ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కోసం 2002లో రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కుల్దీప్‌సింగ్ చైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేశారు. 2004–05లో కమిటీ ఉమ్మడి జిల్లాలో పర్యటించింది. అసెంబ్లీ నియోజకవర్గాల హద్దుల మార్పు.. పరిపాలన సౌలభ్యం.. ప్రజల అనుకూలత వంటి అంశాలపై ప్రజాభిప్రాయం సేకరించింది. 2006లో హైదరాబాద్‌లో రాజకీయ పార్టీల నా యకులతో సమావేశాలు నిర్వహించింది. అన్ని వర్గాల నుంచి వచ్చిన వినతులు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని, 2007లో పార్లమెంట్‌కు నివేదిక అందజేసింది. ఈ కమిటీ సిఫా ర్సులకు 2008 ఫిబ్రవరిలో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాభారతి ఆమోదముద్ర వేశారు. ఆ త ర్వాత వచ్చిన 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ని యోజకవర్గాల వారీగా ఎన్నికలు నిర్వహించారు.
మారిన రిజర్వేషన్లు..
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆయా సెగ్మెంట్లలో చేరిన కొత్త మండలాల్లోని ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు మారిపోయా యి. 2009కి ముందు రెండు ఎస్సీ(మేడారం), (నేరెళ్ల) అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత కొత్తగా మూడు ఎస్సీ నియోజకవర్గాలు చొప్పదండి(అంతకుముందు జనరల్), ధర్మపురి, మానకొండూరు ఏర్పాటయ్యాయి. విభజనలో మెట్‌పల్లి, మేడారం, నేరెళ్ల, కమలాపూర్, బుగ్గారం, ఇందుర్తి నియోజకవర్గాలు కనుమరుగయ్యాయి. వీటి స్థానంలో కోరుట్ల, రామగుండం, వేములవాడ, ధర్మపురి, మానకొండూర్, హుస్నాబాద్ నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి.
ఉనికి కోసం తిప్పలు..
సెగ్మెంట్లతోపాటు గతంలో ఉన్న మండలాల్లోనూ మార్పులు జరగడంతో కొంతమంది నేతలు తమ పట్టు కోల్పోగా.. మరికొంత మందికి కలిసొచ్చింది. బుగ్గారం, మెట్‌పల్లి నియోజకవర్గాలు కలిసిపోయి కోరుట్లగా ఏర్పాటవడం మెట్‌పల్లి ప్రాంతం వారికి మేలు చేసింది. బుగ్గారానికి చెందిన నాయకులు ఉనికి కోసం తిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కమలాపూర్, ఇందుర్తి, నేరెళ్ల ప్రాంతాలకు చెందిన లీడర్లు కొంతమంది పట్టున్న ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. గతంలో మెట్‌పల్లి నియోజకవర్గంలోని మేడిపల్లి, కథలాపూర్ మండలాలు వేములవాడలో విలీనం కావడంతో ఆ ప్రాంతంలోని లీడర్లకు ఇప్పటికీ పూర్తిస్థాయి పట్టు దొరకడం లేదు. పెద్దపల్లి, మేడారం నియోజకవర్గాల పరిధిలోనూ కొంతమంది నేతలకు వలసల ఇబ్బంది తప్పలేదు. పాతమేడారం నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్న కొందరు ధర్మపురి, చొప్పదండి సెగ్మెంట్లలో పాగా వేశారు. ఇలా సెగ్మెంట్ల పునర్విభజన ఉమ్మడి జిల్లాలోని నేతలపై ప్రభావం చూపడమే కాకుండా రాజకీయ సమీకరణాల్లో ఎన్నో మార్పులకు తావిచ్చింది.
2009కి ముందు సెగ్మెంట్లు
బుగ్గారం, మెట్‌పల్లి, జగిత్యాల, మేడారం, హుజూరాబాద్, కమలాపూర్, కరీంనగర్, మంఽథని, నేరెళ్ల(ఎస్సీ), సిరిసిల్ల, ఇందుర్తి, చొప్పదండి, పెద్దపల్లి.
2009 తర్వాత సెగ్మెంట్లు
కరీంనగర్, మానకొండూర్(ఎస్సీ), హుజూరా బాద్, హుస్నాబాద్, చొప్పదండి(ఎస్సీ), వేములవాడ, సిరిసిల్ల, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి(ఎస్సీ), పెద్దపల్లి, రామగుండం, మంథని.
నియోజకవర్గాల పునర్విభజనకు 15 ఏళ్లు
2002లో రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కుల్దీప్‌సింగ్ చైర్మన్‌గా కమిటీ
2009లో కొత్తవి ఏర్పాటు
పట్టు కోల్పోయిన పలువురు నేతలు