సీనియర్లే..! | - | Sakshi
Sakshi News home page

సీనియర్లే..!

Oct 30 2023 4:52 AM | Updated on Oct 30 2023 4:52 AM

- - Sakshi

మనోళ్లు

ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983, 1989, 1996 ఉప ఎన్నిక, 1999, 2004, 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి జరగనున్న శాసనసభ ఎన్నికల్లో బరిలో నిలుస్తున్నారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 2004, 2008లో మేడారం నుంచి 2009, 2010, 2014, 2018లో ధర్మపురి నుంచి మొత్తం ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.

ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. 2004, 2008, 2009, 2010, 2014, 2018, 2021 ఎన్నికల్లో మొత్తం ఏడుసార్లు విజయం సాధించారు. ఇందులో 2008, 2010, 2021 ఉప ఎన్నికలు ఉన్నాయి. 2021లో ఆయన బీజేపీలో చేరి విజయం సాధించడం గమనార్హం.

సిరిసిల్ల నుంచి కేటీఆర్‌, వేములవాడ నుంచి చెన్నమనేని రమేశ్‌బాబు, కోరుట్ల నుంచి కె.విద్యాసాగర్‌రావు 2009, 2010, 2014, 2018లో వరుసగా ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇందులో 2010లో ఉప ఎన్నిక కావడం విశేషం. ప్రస్తుతం రమేశ్‌బాబు, విద్యాసాగర్‌రావు ఈ సారి పోటీలో లేరు.

మంథని నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 1999, 2004, 2009లో కాంగ్రెస్‌ నుంచి వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్‌ నమోదు చేశారు. 2014లో ఓడినప్పటికీ 2018లో తిరిగి శాసన సభకు నాలుగోసారి ఎన్నికయ్యారు.

గంగుల కమలాకర్‌ 2009, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్‌ విజయం సాధించారు. ఈ విజయాలతో కరీంనగర్‌లో తన పేరిట కొత్త రికార్డు లిఖించుకుని, నాలుగోసారి విజయంపై కన్నేశారు.

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: స్కూల్‌.. కాలేజీ.. పనిచేసే చోట.. అంతెందుకు కుటుంబంలోనూ చిన్నా, పెద్ద, సీనియర్‌, జూనియర్‌ అన్న వ్యత్యాసాలు సర్వసాధారణం. ఇందుకు అసెంబ్లీ కూడా మినహాయింపు ఏమీ కాదు. ఇపుడున్న సభలో ఉమ్మడి రాష్ట్రం నుంచి వరుసగా ఎన్నిసార్లు ఎన్నికలు వచ్చినా.. విజయం సాధిస్తున్న ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. వీరిని సీనియర్‌ శాసనసభ్యులు అంటూ స్పీకర్‌, తోటి ఎమ్మెల్యేలు సంబోధించడం పరిపాటే. అది ఆయా నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేలకు ఉన్న ప్రజాబలం, సభలో వారికి ఉన్న అనుభవానికి తోటి సభ్యులు ఇచ్చే మర్యాద, గౌరవాలకు సూచన. అలాంటి సీనియర్‌ ఎమ్మెల్యేల్లో అధికశాతం మంది కరీంనగర్‌ జిల్లాకు చెందిన వారు కావడం గమనార్హం. ప్రస్తుతం సభలో ఉన్న సభ్యులను మిగిలిన జిల్లాల సభ్యులతో పోల్చినపుడు ఉమ్మడి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలే సీనియర్లుగా నిలుస్తున్నారు. వీరిలో మెజారిటీ గులాబీ పార్టీకే చెందిన వారు కావడం విశేషం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షతో పురుడుపోసుకున్న పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి)కి మొదటి నుంచి కరీంనగర్‌ జిల్లాలో పట్టు ఎక్కువ. అందుకే రాష్ట్ర సాధనలో భాగంగా పలుమార్లు రాజీనామాలు చేయడం.. తిరిగి ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో వీరు తమతోపాటు సభకు ఎంపికై న తోటి ఎమ్మెల్యేల కంటే అత్యధిక సార్లు విజయం సాధించిన నేతలుగా అరుదైన గుర్తింపు సాధించారు. ప్రస్తుతం జరగనున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ శాసన సభకు మూడోవి. అదే సమయంలో సభలో కనిష్టంగా రెండు నుంచి గరిష్టంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినవారు సభలో ఉండటం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలో వారు సాధించిన వరుస విజయాలే వారి సీనియారిటీకి కారణం.

దివంగత మాజీ ఎమ్మెల్యేల రికార్డు

6

7

3

అసెంబ్లీలో సీనియర్లంతా ఉమ్మడి జిల్లావారే..!

నాలుగు నుంచి ఏడుసార్లు శాసనసభకు ఎన్నిక

ఉద్యమాల గడ్డ కావడమే ప్రధాన కారణం

దివంగత చెన్నమనేని రాజేశ్వర్‌రావు 1957లో చొప్పదండి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం సిరిసిల్ల నియోజకవర్గం నుంచి 1967, 1978, 1985, 1994, 2004లో ఆరుసార్లు విజయం సాధించి రికార్డు సృష్టించారు.

దివంగత దేశిని చిన్నమల్లయ్య 1978, 1984, 1989, 1994లో ఇందుర్తి (ప్రస్తుతం హుస్నాబాద్‌) నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.

కమలాపూర్‌ ఎమ్మెల్యేగా దివంగత ముద్దసాని దామోదర్‌రెడ్డి 1985, 1989, 1994, 1999లో నాలుగుసార్లు విజయం సాధించారు. దివంగత ఎన్టీఆర్‌ హయాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.

1
1/9

2
2/9

3
3/9

4
4/9

5
5/9

6
6/9

7
7/9

8
8/9

9
9/9

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement