TS Karimnagar Assembly Constituency: సీఎం పెద్దపల్లి నుంచి పోటీ చేయాలి : బొంకూరి సురేందర్‌ సన్నీ
Sakshi News home page

సీఎం పెద్దపల్లి నుంచి పోటీ చేయాలి : బొంకూరి సురేందర్‌ సన్నీ

Aug 14 2023 1:52 AM | Updated on Aug 14 2023 8:28 AM

- - Sakshi

కరీంనగర్: సీఎం కేసీఆర్‌ పెద్దపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని కోరుతూ ఈ నెల 26న భీమ్‌ గర్జన ర్యాలీ నిర్వహిస్తున్నామని ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ బొంకూరి సురేందర్‌ సన్నీ తెలిపారు. ఆదివారం పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌లో కౌన్సిలర్లు బొంకూరి భాగ్యలక్ష్మి, ఈరబోయిన శ్రీనివాస్‌లతో కలిసి, మాట్లాడారు. సహజ వనరులు, పారిశ్రామిక ప్రాంతం కలిగి ఉన్న పెద్దపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించారని అన్నారు.

ర్యాలీని విజయవంతం చేసి, సీఎం కేసీఆర్‌ పెద్దపల్లి నుంచి పోటీ చేసేందుకు ఆహ్వానించాలని పిలుపునిచ్చారు. బస్టాండ్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం నుంచి జెండా కూడలిలోని కాన్షీరాం విగ్రహం వరకు ర్యాలీ ఉంటుందన్నారు. సీఎం పెద్దపల్లికి ప్రాతినిధ్యం వహిస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement