ప్రకృతే ‘ప్రీతి’పాత్రం | Sakshi
Sakshi News home page

ప్రకృతే ‘ప్రీతి’పాత్రం

Published Fri, Jul 21 2023 1:38 AM

- - Sakshi

కరీంనగర్‌: తన చుట్టూ ఉన్న ప్రకృతి, జీవరాశుల గురించే అద్భుతమైన కవితలు రాస్తున్న కరీంనగర్‌కు చెందిన ప్రీతి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్‌ నోబల్‌ అవార్డుకు ఎంపికైంది. ఇండియన్‌ నోబల్‌ సోసైటీ కౌన్సిల్‌ ద్వారా బుధవారం అవార్డును స్వీకరించింది. జగిత్యాలలో జన్మించిన ప్రీతి తండ్రి విజయకుమార్‌ ఎస్‌బీఐలో బ్యాంక్‌ ఉద్యోగి కాగా తల్లి సౌజన్య గృహణి.

ప్రీతి ఇంటర్‌ సమయంలో కరీంనగర్‌లోని బ్యాంక్‌కాలనీలో స్థిరపడ్డారు. స్కూల్‌ సమయంలో తన చుట్టూచూస్తున్న ప్రకృతిపై కవితలు రాయడం ప్రారంభించింది. తరువాత ఫేస్‌బుక్‌లో, అనంతరం పుస్తకాలు రాసి ఇండియాతో పాటు మలేషియా, సింగపూర్‌, బంగ్లాదేశ్‌ కాిపీరైట్స్‌ సంపాదించింది. 2019లో నెకెడ్‌లవ్‌, 2021లో సోలిటస్‌సోల్స్‌ అనే కవితల సంపుటిని సొంతంగా రాసి విడుదల చేసింది. 2020లో పెటెల్స్‌ అనే కవిత పుస్తకం రాయడంలో తన సహకారం అందించింది.

పలు దేశాల్లో తన పుస్తకాలు అమ్మకాలు జరిగాయి. ప్రీతి రచనలు హైదరాబాద్‌లోని రైట్‌క్లబ్‌లో రెండో బహుమతి సాధించగా 2021లో ఢిల్లీలోని బుక్‌ ఫెయిర్‌కు ఎంపికై ంది. అమెరికాలోని పోయమ్‌హంటర్‌తో పాటు హెలో పొయోట్రీలలో ఆన్‌లైన్‌ ద్వారా పంపించి మంచి ప్రతిభ కనిబరించి వారి నుంచి ప్రశంసలు అందుకుంది. తాను రాసిన మూడు కవిత సంపుటాలకు మూడు ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయి.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement