నాలుగేళ్ల ప్రేమ.. మరో యువతితో పెళ్లి.. కూతురికి అవమానం జరగడంతో | - | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల ప్రేమ.. మరో యువతితో పెళ్లి.. ప్రియుడే కావాలని పట్టుబటిన కూతురు.. చివరకు

Published Sun, Jun 18 2023 8:22 AM | Last Updated on Sun, Jun 18 2023 9:08 AM

- - Sakshi

గన్నేరువరం(మానకొండూర్‌): కూతురు ప్రియుడి చేతిలో మోసపోయిందనే అవమాన భారంతో ఓ తల్లి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన చాడ బాపురెడ్డి, అదే గ్రామానికి చెందిన బండి లత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల చాడ బాపురెడ్డి మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే చాడ బాపురెడ్డి తనను మోసం చేశాడని ఈనెల 15న లత పోలీసుల ఆశ్రయించింది.

ప్రియుడితోనే ఉంటానని లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టంచేసింది. దీంతో పోలీసులు ఆమెను కరీంనగర్‌లోని సఖి కేంద్రానికి తరలించి భద్రత కల్పించారు. ఇంతలోనే లత తల్లి సారవ్వ(42) కూతురికి అన్యాయం జరిగిందని మనోవేదనకు గురై శుక్రవారం రాత్రి పురుగుల మందుతాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యంలో సారవ్వ మృతి చెందింది. శనివారం మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ప్రియుడు బాపురెడ్డి ఇంటి ఎదుట సారవ్వ శవాన్ని ఉంచేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

ఎస్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌ సర్ది చెప్పేప్రయత్నం చేసినా.. వినిపించుకోలేదు. మృతురాలి కూతురు బండి లత ప్రియుడు బాపురెడ్డి ఇంటి ఎదుట బైఠాయించింది. మాయమాటాలతో తనను మోసం చేశాడని ఆరోపించింది. కుటుంబం వి చ్ఛిన్నం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేసింది. పురుగుల మందు తాగించి హత్య చేసేందుకు యత్నించాడని పేర్కొంది. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తిమ్మాపూర్‌ సీఐ ఇంద్రసేనారెడ్డి హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement