పరిమితికి మించి విద్యార్థులను వాహనాల్లో ఎక్కించొద్దు | - | Sakshi
Sakshi News home page

పరిమితికి మించి విద్యార్థులను వాహనాల్లో ఎక్కించొద్దు

Nov 29 2026 1:14 AM | Updated on Nov 29 2026 1:14 AM

పరిమితికి మించి విద్యార్థులను వాహనాల్లో ఎక్కించొద్దు

కామారెడ్డి టౌన్‌: ఆటోలు, ఇతర వాహనాల్లో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించవద్దని అలా చేస్తే చర్యలు తప్పవని జిల్లా రవాణాశాఖ అసిస్టెంట్‌ మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు ఉదయ్‌ కుమార్‌, కృష్ణతేజ హెచ్చరించారు. శనివారం జిల్లా కేంద్రంతో పాటు రహదారులపై విద్యార్థుల భద్రత దృష్ట్యా వాహనాలను తనిఖీ చేశారు. మూడు రోజులుగా తనిఖీలు నిర్వహించి, డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, పరిమితికి మించి చిన్నారులను, విద్యార్థులను ఎక్కించుకొని ప్రయాణాలు సాగిస్తే ఆటోలను సీజ్‌ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు.

నేడు ఉచిత వైద్య శిబిరం

రామారెడ్డి: తెలంగాణ ముదిరాజ్‌ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రామారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం ఉదయం ఉచిత మెగా వైద్య శిబిరం ఉంటుందని నిర్వాహకులు శనివారం తెలిపారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement