భిక్కనూరు: కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ భిక్కనూరు పోలీస్ స్టేషన్‌ను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలోని శాంతిభద్రతల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పోలీసులు ప్రజలతో స్నేహ పూర్వకంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట సీఐ నరేశ్, ఎస్సై అనిల్ పాల్గొన్నారు.
కామారెడ్డి రూరల్: మహిళా సంఘాల కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించాలని ఐకేపీ డీపీఎంలు శ్రీనివాస్, సురేశ్‌కుమార్, వెంకటేశం సూచించారు. శనివారం కామారెడ్డి మండల సమాఖ్య కార్యాలయంలో కామారెడ్డి, రాజంపేట మండలాల ఏపీఎంలు, సీసీలు, వీవోఏలకు, కంప్యూటర్ ఆపరేటర్లకు లోకోస్ డ్యాష్‌బోర్డ్‌పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. టీవోటీ లుగా తాడ్వాయి ఏపీఎం రాజు, కంప్యూటర్ ఆపరేటర్ నరేశ్ శిక్షణ అందించారు. కార్యక్రమంలో ఏపీఎంలు శ్రీనివాస్, రాజారెడ్డి, సీసీలు, వీవోఏలు, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: నిజాంసాగర్‌లోని జవహర్ న వోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవే శం కోసం శనివారం పరీక్ష నిర్వహించారు. జి ల్లాలో 2,891 మంది విద్యార్థులు దరఖాస్తు చే సుకోగా 14 పరీక్ష కేంద్రాలను ఏ ర్పాటు చేశా రు. 2,582 మంది(89.31 శాతం) పరీక్షకు హా జరయ్యారని డీఈవో మల్లికార్జున్ తెలిపారు.
వివాహిత ఆత్మహత్య
జక్రాన్‌పల్లి: మండలంలోని సికింద్రాపూర్ గ్రామాని కి చెందిన అప్పాల రవళి (35) శనివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఏఎస్సై పరమేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం..రవళికి 11 ఏళ్ల క్రితం అప్పాల రవి అలియాస్ శంకర్‌తో వివాహం జరిగింది. కొంతకాలంగా భర్త రవి మద్యానికి బానిసై, ఎలాంటి పని చేయకపోవడంతో కుటుంబ పోషణ భారం మొత్తం రవళిపై పడింది. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో మనస్తాపానికి గురైన రవళి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి హేమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలికి భర్త, ఇద్దరు కొడుకులు ఉన్నారు.
పురుగుల మందు సేవించి వృద్ధుడు..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి చెందిన కాయిత భూమయ్య(74) జీవితంపై విరక్తి చెంది శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. భార్య మరణించడంతో భూమయ్య కొంతకాలంగా మానసికంగా బాధపడుతున్నాడు. అతని కుమారుడు మోహన్ శుక్రవారం గ్రామ శివారులో జరుగుతున్న భూసర్వే వద్దకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న భూమయ్య గుర్తుతెలియని పురుగుల మందు సేవించి వాంతులు చేసుకున్నాడు. గమనించిన కుటుంబసభ్యులు భూమయ్యను చికిత్స నిమిత్తం మెదక్ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భూమయ్య మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుమారుడు మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పొక్లెయిన్, రెండు ట్రాక్టర్లు సీజ్
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మొరం రవాణా చేస్తున్న ఒక పొక్లెయిన్, రెండు ట్రాక్టర్లను పోలీసులు శనివారం స్వాఽధీనం చేసుకున్నారు. వాహనాల యజమానులు, డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు.


