పౌష్టికాహారం తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పౌష్టికాహారం తీసుకోవాలి

Nov 29 2026 1:14 AM | Updated on Nov 29 2026 1:14 AM

ముమ్మరంగా చెరుకు క్రషింగ్‌

రామారెడ్డి: గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలని డీఎంహెచ్‌వో జే వెంకట్‌ అన్నారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆయన శనివారం తనిఖీ చేశారు. పీహెచ్‌సీకి వచ్చిన 19 మంది గర్భిణులకు ఆయన వైద్య పరీక్షలు చేశా రు. పరీక్షల్లో 7 హైరిస్క్‌ గర్భిణు కేసులను గు ర్తించారు. గర్భిణులకు పౌష్టికాహారం, సమతుల్య ఆహారం ఆవశ్యకత గురించి వివరించారు. పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది ఉన్నారు.

అభివృద్ధి పనులకు తీర్మానం

దోమకొండ: మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు జీపీ పాలకవర్గ సభ్యులు తీర్మానించారు. శనివారం సర్పంచ్‌ ఐరేని నర్సయ్య అధ్యక్షతన జీపీ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. గ్రామంలో మురికి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణానికి తీర్మానించారు. అదేవిధంగా తాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం తీర్మానాలు చేశారు. ఉపసర్పంచ్‌ బొమ్మె ర శ్రీనివాస్‌, వార్డు సభ్యులు పాలకుర్తి శేఖర్‌, బీసు సతీశ్‌, అమర్‌నాథ్‌, కొండల్‌రెడ్డి, కటికె శ్రీనివాస్‌, ఐరేని లత, బత్తిని సునీత, జీపీ కార్యదర్శి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

5 ఎంవీఏ పవర్‌

ట్రాన్స్‌ఫార్మర్‌ ప్రారంభం

కామారెడ్డి రూరల్‌: మండలంలోని చిన్నమల్లారెడ్డి సబ్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన 5 ఎంవీఏ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను అధికారులు శనివారం ప్రారంభించారు. ్‌భవిష్యత్తులో ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా దీనిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పనులకు సహకరించిన ఆయా గ్రామా ల పాలకవర్గాలకు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సదాశివనగర్‌: అడ్లూర్‌ ఎల్లారెడ్డిలోని గాయత్రి షుగర్‌ ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. శనివారం నాటికి 86,372 టన్నుల క్రషింగ్‌ జరిగిందని ఫ్యాక్టరీ వైస్‌ ప్రెసిడెంట్‌ వేణుగోపాల్‌రావు తెలిపారు. పర్మిట్ల ఆధారంగా చెరుకును గానుగకు తరలిస్తున్నామన్నారు.

హనుమాన్‌ చాలీసా పారాయణం

నస్రుల్లాబాద్‌: మండలంలోని మిర్జాపూర్‌ హను మాన్‌ ఆలయంలో భక్తులు సామూహిక హనుమాన్‌ చాలీసా పారాయణం చేశారు. ప్రతి శనివారం హనుమాన్‌ చాలీసా పారాయణం చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement