అర్హులకు రుణాలు అందేలా చూడాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులకు రుణాలు అందేలా చూడాలి

Nov 6 2026 1:44 AM | Updated on Nov 6 2026 1:44 AM

కామారెడ్డి రూరల్‌: మహిళా సంఘాల్లో అర్హులైన సభ్యులకు రుణాలు అందేలా చూడాలని ఐకేపీ డీపీఎం రాజయ్య సూచించారు. కామారెడ్డి మండల సమాఖ్య కార్యాలయంలో ఐదు మండలాలకు చెందిన వీవోఏలు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు (సీసీ)లకు గురువారం వ్యక్తిగత జీవనోపాధుల రుణ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేసే విధానంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మహిళా సంఘాల సభ్యులకు వ్యక్తిగత జీవనోపాధుల కల్పనలో భాగంగా అందించే రుణాలను పారదర్శకంగా, సులభతరంగా అందించేందుకు ఆన్‌లైన్‌ విధానంపై సంబంధిత సిబ్బందికి ప్రత్యేక అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బీబీపేట, మాచారెడ్డి, రాజంపేట, తాడ్వాయి, దోమకొండ, కామారెడ్డి మండలాల ఏపీఎంలు రాజారెడ్డి, శ్రీనివాస్‌, సీఆర్‌పీలు మౌనిక, నిఖిత, గంగారెడ్డి, రాజారెడ్డి, సాయిలు, ప్రసాద్‌, వెంకట్‌ గౌడ్‌, దేవరాజ్‌ గౌడ్‌, కృష్ణాంజలి, రాజయ్య, అంజాగౌడ్‌, దుర్గాదాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement