శబరిమలకు మహా పాదయాత్ర | - | Sakshi
Sakshi News home page

శబరిమలకు మహా పాదయాత్ర

Nov 6 2026 1:44 AM | Updated on Nov 6 2026 1:44 AM

శబరిమలకు మహా పాదయాత్ర నేడు ఎమ్మెల్యే రాక కొనసాగుతున్న పీఎంఏజేవై సర్వే అక్రమాలపై విచారణ చేపట్టాలి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

బాన్సువాడ: పట్టణంలోని అయ్యప్ప ఆలయం నుంచి కేరళలోని శబరిమలకు అయ్యప్ప స్వా ములు మహాపాదయాత్రగా తరలివెళ్లారు. అంతకుముందు స్వాముల పాదయాత్రను గురువారం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అలాగే ఆలయంలో స్వామివారి పల్లకీసేవలో ఎమ్మెల్యేతోపాటు ఆగ్రో మాజీ చైర్మన్‌ కాసుల బాల్‌రాజ్‌ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత 15 ఏళ్లుగా బాన్సువాడ నుంచి అయ్యప్ప స్వాములు మహాపాదయాత్రగా శబరిమలై కొండకు వెళ్లడం గొప్ప సంకల్పమన్నారు. ఆర్డీవో రవీందర్‌రెడ్డి, గురుస్వాములు గురువినయ్‌, మల్లికార్జున్‌, విఠల్‌రెడ్డి ఉన్నారు.

నాగిరెడ్డిపేట: మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు శుక్రవారం రానున్నట్లు మండల కాంగ్రెస్‌ నాయకులు గురువారం తెలిపారు. మండలంలోని పోచారం, గోపాల్‌పేట, చీనూర్‌, రాఘవపల్లి, మాటూర్‌, బొల్లారం గ్రామాల్లో ఆయన పర్యటిస్తారని, ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలతోపాటు మహిళా సంఘ భవనాల నిర్మాణాలకు భూమిపూజ చేస్తారని అన్నారు. మాల్తుమ్మెద శివారులో గోదాం నిర్మాణానికి భూమిపూజ చేస్తారని వారు పేర్కొన్నారు.

కామారెడ్డి రూరల్‌: ఇస్రోజీవాడీ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పీఎంఏజేవై పథకంలో భాగంగా రెండో రోజు గురువారం సర్వే కొనసాగింది. గ్రామంలో రెండు రోజులపాటు సర్వే నిర్వహించారు. గ్రామంలోని కుటుంబాల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, అవసరమైన అభివృద్ధి పనుల వివరాలను సేకరించారు. సర్వేతో గ్రామానికి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సదుపాయాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని సర్పంచ్‌ చిందం మల్లేశ్‌, ఉపసర్పంచ్‌ సిద్ధం స్వామి తెలిపారు. ప్రతి కుటుంబం సర్వే బృందానికి సహకరించాలని కోరారు. జీపీల కార్యదర్శులు నవనీత, మాధవిలత, ఆశా వర్కర్లు సిద్ధం సావిత్రి, గ్రామస్తులు దుబ్బాక రాజయ్య, మదాని రాజయ్య పాల్గొన్నారు.

కామారెడ్డి టౌన్‌: మున్సిపల్‌లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ జిల్లా కేంద్రానికి చెందిన నర్సోళ్ల మహేశ్‌ గురువారం కలెక్టరేట్‌లో ఏవోకు వినతిపత్రం అందజేశారు. కొద్ది రోజులుగా కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, బల్దియాకు సంబంధించి సామగ్రి అమ్ముకున్నారని వీటిచపై విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

మాచారెడ్డి: జిల్లాకేంద్రంలో ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాస్థాయిలో నిర్వహించిన అథ్లెటిక్స్‌, వాలీబాల్‌ పోటీలు నిర్వహించగా, పాల్వంచ మర్రి వద్ద నున్న ఆర్‌ఆర్‌ ప్రయివేట్‌ ఉన్నత పాఠశాల విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన అండర్‌–14 బాలికల అథ్లెటిక్స్‌ లాంగ్‌ జంప్‌ విభాగంలో నిహారిక రజత పతకం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ంది. అదేవిధంగా అండర్‌–17 బాలికల విభాగంలో మధుప్రసన్న రాష్ట్రస్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌కు కామారెడ్డి, నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాల నుంచి ఎంపికై ంది. ఒకే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు వేర్వేరు క్రీడా విభాగాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేందర్‌రెడ్డి, ఉపాధ్యాయులు వారిని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement