మెడికల్‌ కళాశాలలో విద్యార్థి సంఘాల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కళాశాలలో విద్యార్థి సంఘాల ఆందోళన

Nov 6 2026 1:44 AM | Updated on Nov 6 2026 1:44 AM

కామారెడ్డి టౌన్‌: స్థానిక ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో చోటుచేసుకున్న ర్యాగింగ్‌ ఘటనను నిరసిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. గురువారం కళాశాల ఎదుట కొద్దిసేపు బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వాల్యా చాంబర్‌లోకి వెళ్లి బైఠాయించి, ప్లకార్డుల ప్రదర్శనతో నినాదాలు చేశారు. కళాశాలలో ఇలాంటి ర్యాగింగ్‌ ఘటన జరగడం సిగ్గుచేటని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాంటీ ర్యాగింగ్‌ కమిటీ నిర్లక్ష్యం వల్లే సీనియర్లు జూనియర్లపై ర్యాగింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ క్రమంలో ప్రిన్సిపాల్‌తో నాయకులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. నాయకుల తీరుపై ప్రిన్సిపాల్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, కళాశాలలో ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సమాచారం అందుకున్న దేవునిపల్లి పోలీసులు అక్కడికి చేరుకుని నాయకులను శాంతింపజేశారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఏ రాష్ట్ర కో–కన్వీనర్‌ జీవీఎం విఠల్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ముదాం అరుణ్‌కుమార్‌, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి సురేశ్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకుడు సాయినాథ్‌, ఏఐఎస్‌ఏ జిల్లా ఇన్‌చార్జి పేరుమడ్ల బుల్లెట్‌, బీవీఎం రాష్ట్ర అధ్యక్షుడు రవితేజ, విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు వినయ్‌కుమార్‌, జీవీఎం జిల్లా అధ్యక్షుడు వినోద్‌, రోహిత్‌, రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement