రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి | - | Sakshi
Sakshi News home page

రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి

Nov 6 2026 1:44 AM | Updated on Nov 6 2026 1:44 AM

నిజాంసాగర్‌/ మాచారెడ్డి/ పిట్లం: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో యాసంగి సీజన్‌లో ఆరుతడి పంటలు సాగు చేయాలని మహమ్మద్‌నగర్‌ తహసీల్దార్‌ లత రైతులకు సూచించారు. గురువారం మహమ్మద్‌నగర్‌ మండల కేంద్రంలోనీ జీపీలో సర్పంచ్‌ దఫేదార్‌ బాలమణి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. తహసీల్దార్‌ మాట్లాడుతూ.. సింగితం రిజర్వాయర్‌ కింద పెసర, మినుము, జొన్న, మొక్కజొన్న పంటలు వేసుకోవాలని సూచించారు. ఉప సర్పంచ్‌ మిడుత సాయిలు, ఏఈవో మధుసూదన్‌, జీపీ కార్యదర్శి అంజయ్య, వార్డు సభ్యులు, రైతులు పాల్గొన్నారు. పాల్వంచ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రబీలో ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని ఉమ్మడి మాచారెడ్డి మండల వ్యవసాయాధికారి పవన్‌ కుమార్‌ సూచించారు. తహసీల్దార్‌ జనార్దన్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌, వీఏఎస్‌ హేమశ్రీ, హెచ్‌ఈవో బాపురెడ్డి, ఏపీవో సాయిబాబు, అధికారులు, రైతులు ఉన్నారు. పిట్లం మండలంలోని జీపీ కార్యాలయంలో సర్పంచ్‌ సుజాత అధ్యక్షతన పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి పొదుపు చర్యలు, పశువుల తొట్టెల నిర్మాణానికి అనుమతుల మంజూరుపై చర్చించారు. గ్రామస్తులు నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని కోరారు. ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు, జీపీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement