నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

Nov 6 2026 1:44 AM | Updated on Nov 6 2026 1:44 AM

● ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు

లింగంపేట: ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు అన్నారు. గురువారం ఆయన లింగంపేట మండలంలోని గాంధీనగర్‌, ముస్తాపూర్‌, జగదాంబ తండా, ఒంటర్‌పల్లి, లింగంపల్లి, లింగంపేట గ్రామాల్లో పలు అబివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడారు. గ్రామాల్లో బీటీ, సీసీ రోడ్లు, డ్రెయినేజీ, అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, జీపీ భవనాలు, 16 పాఠశాలలకు అదనపు గదుల నిర్మాణానికి, 8 సబ్‌ స్టేషన్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. జగదాంబ తండాలో రూ. 20లక్షలతో నిర్మించిన జీపీ భవనం, రూ. 10లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనం, ఒంటర్‌పల్లిలో రూ. 20లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ, లింగంపల్లిలో 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి భూమిపూజ చేశారు. నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌ రవీందర్‌, ఉపసర్పంచ్‌ ప్రసాద్‌గౌడ్‌, పార్టీ మండల అధ్యక్షుడు సాయిరాంయాదవ్‌, సొసైటీ చైర్మన్‌ నారాగౌడ్‌, ఎంఈవో అంజల్‌రెడ్డి, హెచ్‌ఎం వహీద్‌సిద్ధిఖీ, సర్పంచులు, ఉపసర్పంచులు, సొసైటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు అండాగా ఉంటా

మండలంలోని ఆయా గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు భరోసా ఇచ్చారు. పోతాయిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌, సొసైటీ డైరెక్టర్‌ ఆకుల లక్ష్మీనారాయణ చిత్రపటాలకు ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే గ్రామానికి చెందిన భీమయ్య, సాయిలు, వార్డు సభ్యుడు ఎర్రం సంజీవులు, సాయిలు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ఆర్థికసాయం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement