అధికారులు అంకిత భావంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులు అంకిత భావంతో పనిచేయాలి

Oct 30 2026 1:27 AM | Updated on Oct 30 2026 1:27 AM

● జాతీయ గిరిజన తెగల కమిషన్‌ సభ్యుడు హుస్సేన్‌ నాయక్‌

గాంధారి/ రామారెడ్డి: అధికారులు అంకిత భావంతో పనిచేయాలని జాతీయ గిరిజన తెగల కమిషన్‌ సభ్యుడు హుస్సేన్‌ నాయక్‌ అన్నారు. గురువారం ఆయన గాంధారి మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని పలు తండాల్లో పర్యటించారు. మండల కేంద్రంలో సేవాలాల్‌ గుడి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మండల పరిధిలోని గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం వారి సంక్షేమం కోసం పలు పథకాలను ప్రవేశపెట్టిందని, సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పలువురు గిరిజన నాయకులు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. కార్యక్రమంలో కమిషన్‌ డైరెక్టర్‌ కల్యాణ్‌ రెడ్డి, జడ్పీ సీఈవో చందర్‌ నాయక్‌, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సౌజన్య, డీఆర్‌డీవో దామోదర్‌ రెడ్డి, ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్‌, తహసీల్దార్‌ రేణుక చౌహాన్‌, ఎంపీడీవో రాజేశ్వర్‌, అధికారులు, గిరిజన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామారెడ్డి మండల పరిధిలోని స్కూల్‌ తండా జీపీలో జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యులు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ పర్యటించారు. గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అడిషనల్‌ కలెక్టర్‌ వైఎన్‌ గిరి, జెడ్పీ సీఈవో చందర్‌నాయక్‌, తహసీల్దార్‌ ఉమలత, సర్పంచ్‌ బుచ్చిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement