గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి

Oct 30 2026 1:27 AM | Updated on Oct 30 2026 1:27 AM

● జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు

జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌

కామారెడ్డి టౌన్‌ : గిరిజనుల సమస్యల పరిష్కారానికి జాతీయ షెడ్యూల్డ్‌ తెగల కమిషన్‌ అంకితభావంతో కృషి చేస్తోందని కమిషన్‌ సభ్యుడు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ పేర్కొన్నారు. గిరిజన సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలులో అధికారులు నిర్లక్ష్యం వీడి బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్‌లో కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, ఎస్పీ రాజేశ్‌ చంద్రతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్హత ఉన్న ప్రతి గిరిజనుడికి పక్కా ఇల్లు, విద్యుత్‌ కనెక్షన్‌ మంజూరు చేయాలన్నారు. రక్షిత తాగునీరు లేని తండాలను గుర్తించి ‘జల్‌ జీవన్‌ మిషన్‌’ కింద ప్రతిపాదనలు పంపాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, విద్య, వైద్యం వంటి మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, సమస్యలను మానవతా దృక్పథంతో పరిష్కరించాలని పేర్కొన్నారు. స్థానిక అధికారుల వద్ద పరిష్కారం దక్కని పక్షంలో గిరిజనులు నేరుగా జాతీయ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించవచ్చన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్‌, ఎన్‌వై గిరి, డీఎఫ్‌వో సూరజ్‌, ఆర్డీవోలు, డీఎస్పీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement