‘ప్రైవేట్‌’లో పరీక్ష ఫీజు దందా | - | Sakshi
Sakshi News home page

‘ప్రైవేట్‌’లో పరీక్ష ఫీజు దందా

Oct 30 2026 1:27 AM | Updated on Oct 30 2026 1:27 AM

అదనంగా వసూళ్లు..

ఫిర్యాదు చేయాలి..

కామారెడ్డి టౌన్‌: జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలను బేఖాతరు చేస్తూ పదో తరగతి పరీక్ష ఫీజుల పేరిట తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి. పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ పరీక్షల విభాగం షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. రెగ్యులర్‌ విద్యార్థులు రూ.125, వొకేషనల్‌ విద్యార్థులు రూ.185 ఫీజుగా చెల్లించాల్సి ఉంటంది. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా నవంబరు 16వ తేదీ వరకు చెల్లించడానికి అవకాశం ఉంది.

జిల్లాలో 80కి పైగా ప్రైవేట్‌ హైస్కూళ్లు ఉన్నాయి వీటిలో 9 వేలకుపైగా పదో తరగతి విద్యార్థులున్నారు. ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ ఫీజు రూ.125 స్థానంలో రూ.వెయ్యికిపైగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రుసుముతో పాటు స్పెషల్‌ క్లాసులు, ప్రాక్టికల్‌ మార్కులు, హాల్‌టికెట్‌ ప్రాసెసింగ్‌, అధికారుల ఖర్చులంటూ విద్యార్థుల తల్లిదండ్రులనుంచి వసూలు చేస్తున్నారని సమాచారం. దీనిని ప్రశ్నించినా, రిసిప్ట్‌ ఇవ్వాలని అడిగినా.. పాఠశాలల యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నట్లు తెలుస్తోంది. అడిగినంత ఇవ్వకపోతే హాల్‌టికెట్లు నిలిపివేస్తామని, ఇంటర్నల్‌ మార్కులు తగ్గించేస్తామని విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పదో తరగతి పరీక్ష రుసుముగా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును మాత్రమే తీసుకోవాలి. అదనంగా ఒక్క రూపాయి కూడా వసూలు చేయడానికి వీల్లేదు. ఎవరైనా అదనపు రుసుములు డిమాండ్‌ చేస్తే నేరుగా విద్యాశాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలి.

– మల్లికార్జున్‌, డీఈవో, కామారెడ్డి

పదో తరగతి పరీక్షలకు

ప్రభుత్వం నిర్ణయించింది రూ.125

స్కూళ్లలో వసూలు చేస్తోంది

రూ.వెయ్యికిపైనే..

చర్యలు తీసుకోవాలని కోరుతున్న

విద్యార్థుల తల్లిదండ్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement