అంగన్‌వాడీల సేవలు కీలకం | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల సేవలు కీలకం

Oct 1 2026 4:46 AM | Updated on Oct 1 2026 4:46 AM

అంగన్‌వాడీల సేవలు కీలకం నేడు జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు జాబ్‌మేళాకు విశేష స్పందన పేర్లు నమోదు చేసుకోవాలి దరఖాస్తుల స్వీకరణ

నస్రుల్లాబాద్‌: గ్రామాల్లో అంగన్‌వాడీ టీచర్ల సేవలు కీలకమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు పేర్కొన్నారు. మండల కేంద్రంలో మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప్‌ అభియాన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అంగన్‌వాడీ టీచర్లను సన్మానించారు. సమాజ నిర్మాణంలో, చిన్న పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అంగన్‌వాడీ టీచర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, మండల అధ్యక్షుడు చందూరి హన్మండ్లు, నాయకులు లక్ష్మీనారాయణ, వడ్ల సతీష్‌, లక్ష్మణ్‌, నాగరాజు, శేఖర్‌, మల్లేష్‌, సుబ్రహ్మణ్యస్వామి, సాయిలు, సురేష్‌, వెంకన్న పవన్‌ పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: రామారెడ్డి మండలం ఉప్పల్‌వాయి సాంఘిక సంక్షేమ గురుకుల మైదానంలో బుధవారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. జూనియర్స్‌ అండర్‌–14, 16, సబ్‌ జూనియర్స్‌ అండర్‌–10, 12, 14 విభాగాలలో బాలబాలికలకు పోటీలు ఉంటాయని జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు జైపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ తెలిపారు. క్రీడాకారులు పుట్టిన తేదీ సర్టిఫికెట్‌, ఆధార్‌ జిరాక్స్‌తో పోటీలకు హాజరు కావాలని, పూర్తి వివరాలకు 94943 93609 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

బాన్సువాడ రూరల్‌: బాన్సువాడలోని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన జాబ్‌మేళకు విశేష స్పందన లభించింది. టీఏఎస్‌కే, ప్లేస్‌మెంట్‌ సెల్‌, ఐక్యూ ఏసీ, టీఎస్‌కేసీ, మ్యాజిక్‌ బస్‌ ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 22 కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. పదో తరగతినుంచి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన 340కిపైగా ఉద్యోగార్థులు జాబ్‌మేళాకు హాజరయ్యారు. ఇందులో 156 మందికి ఆయా కంపెనీలలో ప్లేస్‌మెంట్‌ లభించిందని కళాశాల ప్లేస్‌మెంట్‌ సెల్‌ సమన్వయకర్త చిరంజీవి తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ గంగాధర్‌, మ్యాజిక్‌ బస్‌ ఫౌండేషన్‌ ప్రోగ్రాం మేనేజర్‌ వేణుగోపాల్‌, కళాశాల టీఎస్‌కేసీ మెంటార్‌ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం కలెక్టరేట్‌లోని 121వ నంబర్‌ గదిలోగల తమ కార్యాలయంలో సంప్రదించాలని ఉపాధి కల్పనాధికారి కిరణ్‌కుమార్‌ సూచించారు. విదేశాల్లో నర్సింగ్‌, ఆప్తాల్మిక్‌, ఫిజయోథెరప్టిస్‌, ఆక్యుపంక్చర్‌, రిజిస్టర్‌ నర్సుల అవకాశాలున్నాయని, ఆసక్తిగల వారు పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. టామ్‌కామ్‌ ఆధ్వర్యంలో ఉద్యోగావకాశాలు కల్పిస్తారని పేర్కొన్నారు.

బిచ్కుంద: బిచ్కుంద మున్సిపాలిటీలో ఏర్పాటు చేస్తున్న బార్‌ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్‌ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. లక్ష రూపాయలను డీడీ లేక చలాన్‌ రూపంలో చెల్లించి అక్టోబర్‌ 12 వరకు కలెక్టరేట్‌లోని జిల్లా ఎకై ్సజ్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏడాదిపాటు బార్‌ నిర్వహణ కోసం విడతల వారీగా ప్రభుత్వానికి రూ.30 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement