వ్యసన విముక్తికి దారేదీ? | - | Sakshi
Sakshi News home page

వ్యసన విముక్తికి దారేదీ?

Oct 1 2026 4:46 AM | Updated on Oct 1 2026 4:46 AM

వ్యసన విముక్తికి దారేదీ?

జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన డ్రంకన్‌డ్రైవ్‌ కేసుల వివరాలు

ఈసారైనా ఏర్పాటయ్యేనా?

జైలు శిక్షల వివరాలు..

జిల్లాలో మద్యం, గంజాయిలకు అలవాటుపడినవారి సంఖ్య పెరుగుతోంది. వీరిని వ్యసనాలనుంచి దూరం చేసేందుకు కేంద్రప్రభుత్వం గతేడాది డిస్ట్రిక్ట్‌ డీఅడిక్షన్‌ సెంటర్‌ను మంజూరు చేసింది. అయితే అధికారుల నిర్లక్ష్యంతో ఏడాది దాటినా వ్యసన విముక్తి కేంద్రం ఏర్పాటు దిశగా అడుగులు పడడం లేదు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

జిల్లాలో మద్యం మత్తుతో పాటు గంజాయి లాంటి మాదకద్రవ్యాలకు కూడా చాలా మంది బానిసలయ్యారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు గంజాయి బారిన పడి భవిష్యత్‌ను దెబ్బతీసుకుంటున్నారు. పోలీసుల తనిఖీలలో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడుతున్నా దందా ఆగడం లేదు. ఇదే సమయంలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతుండడంతో యువత పొద్దస్తమానం తాగి తూగుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలలో 11,528 కేసులు నమోదయ్యాయి. వీరికి రూ. 1.38 కోట్ల జరిమానాలు పడ్డాయి. కోర్టులు 1,391 మందికి జైలు శిక్షలు కూడా విధించాయి. అయినా వ్యసనపరుల్లో మార్పు రావడం లేదు.

జిల్లాకు డీడీఏసీ మంజూరైనా..

మత్తు పదార్థాలకు అలవాటుపడివారి మత్తు దించేందుకు డీఅడిక్షన్‌ సెంటర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. కౌన్సెలింగ్‌, చికిత్సల ద్వారా వారిని మత్తుకు దూరం చేయడానికి అవకాశం ఉంటుంది. జిల్లాలో వేలాది మంది మత్తుకు బానిసలుగా మారి తమ ఒంటిని, ఇంటిని గుళ్ల చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర సామాజిక న్యాయశాఖ గతేడాది మే 28న దేశంలోని పలు జిల్లాలకు డిస్ట్రిక్ట్‌ డీఅడిక్షన్‌ సెంటర్ల (డీడీఏసీ)ను మంజూరు చేసింది. అందులో కామారెడ్డి జిల్లా కూడా ఉంది. డీఅడిక్షన్‌ సెంటర్‌ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను చేపట్టేందుకు నోడల్‌ ఏజెన్సీగా జిల్లా సంక్షేమ శాఖకు బాధ్యతలు అప్పగించింది. నోటిఫికేషన్‌ జారీ చేసి అనుభవం ఉన్న ఎన్జీవోల నుంచి దరఖాస్తులు స్వీకరించి, అన్ని అర్హతలు ఉన్న వారిని ఎంపిక చేసి డీఅడిక్షన్‌ సెంటర్‌ నిర్వహణ బాధ్యతలను అప్పగించాల్సిన బాధ్యత ఆ శాఖదే.. కామారెడ్డిలో డీఅడిక్షన్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం నోటిఫికేషన్‌ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఓ ఎన్జీవోలో అర్హులైన వైద్యులు ఉన్నప్పటికీ ఆ ఎన్జీవోకు అనుభవం లేదన్న సాకు చూపి పక్కన పెట్టారని తెలుస్తోంది. కాగా ఓ అధికారి తమకు అనుకూలమైన ఎన్జీవోకు అనుభవం లేకున్నా డీడీఏసీ ఇప్పించేందుకు ప్రయత్నించి ఫైళ్లను అటూఇటూతిప్పుతూ కాలయాపన చేశారని తెలుస్తోంది. దీంతో ఆ నోటిఫికేషన్‌ను రద్దయ్యింది.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు : 11,528

జరిమానాలు : రూ. 1.38 కోట్లు

శిక్షలు : 1,391

మత్తుకు బానిసలైనవారికి దాని నుంచి విముక్తి కల్పించడంలో డీఅడిక్షన్‌ సెంటర్ల పాత్ర కీలకం. గతేడాది మంజూరైన డీడీఏసీ ఏర్పాటులో కాలయాపనతో నోటిఫికేషన్‌ రద్దయ్యింది. తిరిగి ఇటీవల మరోసారి నోటిఫికేషన్‌ విడుదలైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఒక రోజు: 1,008

రెండు రోజులు: 281

మూడు రోజులు: 46

నాలుగు రోజులు: 13

ఐదు రోజులు: 31

ఏడు రోజులు: 05

12 రోజులు: 01

15 రోజులు: 05

నెల రోజులు: 01

సోషల్‌ సర్వీస్‌: 01

జిల్లాలో మత్తులో జోగుతున్న యువత

తొమ్మిది నెలల్లో 11,528

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు

శిక్షలు పడుతున్నా మారని వ్యసనపరులు

డీఅడిక్షన్‌ సెంటర్‌ ఏర్పాటులో

అధికారుల నిర్లక్ష్యం

మంజూరై ఏడాదైనా

ముందుకు పడని అడుగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement