కామారెడ్డి అర్బన్: ఉమ్మడి జిల్లా ఖోఖో జూనియర్, సీనియర్ బాలబాలికలు, మహిళలు, పురుషుల జట్లను మంగళవారం కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఎంపిక చేశారు. ఎంపిక పోటీలలో 625 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 15 మంది జూనియర్, 15 సీనియర్ క్రీడాకారులను ఉమ్మడి జిల్లా జట్లకు ఎంపిక చేశారు. వీరు అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో రంగారెడ్డి జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొంటారని ఉమ్మడి జిల్లా ఖోఖో అసోసియేషన్ చైర్మన్ అనిల్, అధ్యక్షుడు భూమారెడ్డి, ప్రధాన కార్యదర్శి అతీకుల్లా, కోశాధికారి మధుసూదన్‌రెడ్డి తెలిపారు. అసోసియేషన్ ప్రతినిధులు, పీఈటీలు నాగేశ్వరరావు, మోహన్‌రెడ్డి, సుజాత, అశోక్, భాస్కర్‌రెడ్డి, లింగం, నరేష్‌రెడ్డి, సురేష్, సంజీవ్, సతీష్‌రెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


