1390
● ఉమ్మడి జిల్లాలో 70.25 శాతం
ఉత్తీర్ణత నమోదు
● పరీక్షకు హాజరైన ఉపాధ్యాయులు 1990
● నవంబర్‌లో మరో అవకాశం
ఖలీల్‌వాడి: టీజీటెట్ ఇన్ సర్వీస్ టీచర్స్–2026 ఫలితాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అత్యధిక అర్హత శాతంతో ముందంజలో నిలిచింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 2178 మంది దరఖాస్తు చేసుకోగా.. 1990 మంది పరీక్షకు హాజరయ్యా రు. శనివారం విడుదలైన ఫలితాల్లో 1,390 మంది అర్హత సాధించారు.
రెండో విడత టెట్..
ఇన్ సర్వీస్ టీచర్ల కోసం రెండో విడత ప్రత్యేక టెట్ నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 16 నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను అక్టోబర్ 1న విడుదల చేయనున్నట్లు విద్యా శాఖ వెల్లడించింది.


