తల్లిదండ్రులు పిల్లల చదువుపై దృష్టి పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులు పిల్లల చదువుపై దృష్టి పెట్టాలి

Sep 20 2026 1:09 AM | Updated on Sep 20 2026 1:09 AM

ఎల్లారెడ్డి/సదాశివనగర్‌/తాడ్వాయి: తల్లిదండ్రులు తమ పిల్లలపై దృష్టి పెట్టాలని, చదివేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని ప్రిన్సిపాల్‌ రాజిరెడ్డి అన్నారు. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల సమావేశంలో మాట్లాడారు. ఇంగ్లిష్‌లో ప్రతిభ కలిగిన విద్యార్థులచే డ్రామా కన్వర్జేషన్‌ ఒక పండుగ మాట్లాడించడం జరిగిందన్నారు. ఈవిషయాలతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. నో బ్యాగ్‌ డే సందర్భంగా విద్యార్థులు యూనియన్‌ బ్యాంక్‌ను సందర్శించి బ్యాంక్‌ వారి రోజు కార్యాకలాపలను తెలుసుకున్నారు. ఎల్లారెడ్డి మోడల్‌ స్కూల్‌ లో శనివారం పేరెంట్స్‌ టీచర్స్‌ మీటింగ్‌ నిర్వహించారు. పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్‌ టీచర్స్‌ సమావేశంలో ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ అల్తమాష్‌ జహంగీర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, షూస్‌, మధ్యాహ్నం భోజనం అందిస్తుందన్నారు.తాడ్వాయి కృష్ణాజివాడి పాఠశాలలో నిర్వహించిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో ఎంఈవో రామస్వామి మాట్లాడారు. చైల్డ్‌ ప్రొటెక్షన్‌ జిల్లా ఆఫీసర్‌ మోహన్‌ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయలు, విద్యార్థులు తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement