జాతీయ రహదారిపై గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా | - | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా

Sep 20 2026 1:09 AM | Updated on Sep 20 2026 1:09 AM

తప్పిన పెను ప్రమాదం

కామారెడ్డి రూరల్‌: కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామ శివారులో భారీ ప్రమాదం తప్పింది. గ్యాస్‌ లోడ్‌తో వెళ్తున్న హెచ్‌పీ వాహనం శనివారం అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. దేవునిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి గ్యాస్‌ లోడ్‌ తీసుకొని నాగ్‌పూర్‌ వైపు వెళ్తుండగా అదుపుతప్పిన వాహనం రోడ్డు పక్కన బోల్తాపడింది. ప్రమాదంలో ట్యాంకర్‌ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, ట్యాంకర్‌ బోల్తాపడినప్పటికీ గ్యాస్‌ లీకేజీ కాకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఫైర్‌ సిబ్బంది, పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement