కామారెడ్డి టౌన్ : సిర్నాపల్ల్లి–ఉప్పల్‌వాయి రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్–205టీ ని ఈనెల 17 నుంచి 19 వరకు మూసి ఉంచనున్నట్లు రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ రవి నాగశంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమర్జెన్సీ రైల్ రెన్యువల్స్, ట్రాక్ ఓవర్ హాలింగ్ పనుల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. వాహనాలను అడ్లూర్–ఎల్లారెడ్డి గ్రామం మీదుగా ఉన్న లెవల్ క్రాసింగ్ గేట్ నం. 207 ద్వారా మళ్లించనున్నట్లు తెలిపారు. ఉప్పల్‌వాయి, రామారెడ్డి, తిర్మన్‌పల్లి, మర్కంటి, సదాశివనగర్, రంగంపేట, మోషంపూర్, పోసానిపేట తదితర గ్రామాల ప్రజలు, వాహనదారులు దీనిని గమనించి, రైల్వే శాఖకు సహకరించాలని కోరారు.
కామారెడ్డి అర్బన్: కలెక్టరేట్‌లోని 121 నంబర్ గదిలో గురువారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి కిరణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫోన్‌పేలో ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ మేళా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. 19 నుంచి 35 ఏళ్లలోపు వయసున్న కనీసం ఇంటర్ చదివినవారు అర్హులని, పూర్తి వివరాలకు 91777 95825, 63057 43423 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డిలో రైల్వే ఓవర్ బ్రిడ్జీకి బదులు, అండర్ బ్రిడ్జీ నిర్మించే విషయమై అధికారులతో మాట్లాడుతామని ఎంపీ సురేశ్ షెట్కార్ ప్రజలకు హామీ ఇచ్చా రు. జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ రైల్వే గేటు వద్ద పై వంతెన నిర్మిస్తే తమకు నష్టం జరుగుతుందంటూ స్థానిక ఇళ్ల యజమానులు మంగళవారం కామారెడ్డిలో ఎంపీ షెట్కార్, ప్రభు త్వ సలహాదారు షబ్బీర్ అలీలను కలిసి మొరపెట్టుకున్నారు. ఈ సందర్బంగా ఎంపీ మా ట్లాడుతూ ఆర్వోబీతో ఇళ్లు నష్టపోతామని ఎ వరూ ఆందోళన చెందొద్దన్నారు. తాను కామారెడ్డి ప్రజలకు ఏ ఆపదా వచ్చినా అండగా ఉంటానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ పే ర్కొన్నారు. పాత బస్టాండ్ నుంచి అడ్లూర్ రో డ్డు అధ్వానంగా తయారైనా ఈ రోడ్డు మీదు గా తిరిగే ఎమ్మెల్యే పట్టించుకోలేదని, తాను అధికారులతో గట్టిగా మాట్లాడి వెంటనే పను లు మొదలుపెట్టించానని వివరించారు. వంద ఫీట్ల రోడ్డు వేయిస్తానన్న ఎమ్మెల్యే.. రోడ్డు మీద పడిన గుంతలను కూడా పూడ్చేయించలేదని విమర్శించారు.


