అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు తగవు | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు తగవు

Sep 16 2026 4:01 AM | Updated on Sep 16 2026 4:01 AM

కామారెడ్డి టౌన్‌ : అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని తక్షణమే శిక్షించాలంటూ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకట్‌ మున్సిపల్‌ కార్యాలయం ముందు చేపట్టిన నిరాహార దీక్షకు నాయకులు మంగళవారం పలు సంఘాల నేతలు మద్దతు ప్రకటించారు. ఈ అంశంపై ఎస్సీ, ఎస్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తక్షణమే స్పందించాలని కోరారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వెంటనే అరెస్ట్‌ చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మున్సిపాలిటీనుంచి నిజాంసాగర్‌ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు. మానవహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు గంగారాం, గైని రాజు, కొత్తపల్లి సుధాకర్‌, సత్తిగారి లక్ష్మి, బాగయ్య, మద్దెల రాజు, రాజలింగం, కొత్తపల్లి మల్లన్న, ముదాం సాయిలు, కోమటిపల్లి గంగన్న, రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement