ఆగమనం.. కావొద్దు విషాదం | - | Sakshi
Sakshi News home page

ఆగమనం.. కావొద్దు విషాదం

Sep 7 2026 3:02 AM | Updated on Sep 7 2026 3:02 AM

ఆదేశాలు పాటించాల్సిందే

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

కామారెడ్డి టౌన్‌: ఊరూవాడల్లో గణేశ్‌ నవరాత్రోత్సవాల సందడి మొదలైంది. బొజ్జ గణపయ్యను మండపాలకు ఆహ్వానించేందుకు యువత, ఉత్సవ కమిటీలు పోటీపడుతున్నాయి. అయితే, భక్తిశ్రద్ధల తో ప్రశాంతంగా సాగాల్సిన ‘గణేశ్‌ ఆగమనం’ నే డు ప్రమాదాలకు వేదికవుతోంది. గతంలో వినాయకుడి విగ్రహాన్ని మేళతాళాలు, భజనలతో మంగళకరమైన వాతావరణంలో మండపానికి తీసుకొచ్చేవారు. కొన్నేళ్లుగా మహారాష్ట్ర తరహా ‘ఆగమనం’ పేరిట విపరీత పోకడలు పెరిగిపోయాయి. ట్రాలీలు, లారీలపై వేలాడే భారీ డీజే సౌండ్‌ బాక్సు లు, ఊపిరాడకుండా కాల్చే బాణాసంచా పొగ, మద్యం మత్తులో యువకుల చిందులు.. వెరసి ఆగమనం కాస్తా ప్రమాదకర విన్యాసంగా మారుతోంది. కేవలం ఆర్భాటం, సోషల్‌ మీడియా రీల్స్‌ మోజు, విచ్చలవిడి పోటీతత్వంతో పెడుతున్న డీజేలు, కళ్లు బైర్లు కమ్మే లేజర్‌ లైట్లు, ట్రాఫిక్‌ను స్తంభింపజేస్తూ చేస్తున్న విన్యాసాలు పండుగ ఆనందాన్ని మిగల్చకపోగా.. పచ్చని కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. చవితి ఉత్సవాల్లో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని జిల్లా అధికార యంత్రాంగం కోరుతోంది.

ఆర్మూర్‌లో విద్యుత్‌ తీగలు తగిలి

దెబ్బతిన్న వినాయక ప్రతిమ

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అనుమతి లే ని, పరిమితికి మించిన డీజేల ను వాడితే సీజ్‌ చేయడంతోపాటు నిర్వాహకులపై క్రిమిన ల్‌ కేసులు నమోదు చేస్తారు.

విగ్రహాల ఎత్తు, మా ర్గాల సమాచారాన్ని ముందస్తుగా విద్యు త్‌ శాఖ, ట్రాఫిక్‌ పోలీసులకు తెలియజేయాలి.

రోడ్లపై అడ్డదిడ్డంగా వాహనాలు నిలపడం, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిస్తే వాహనాలను సీజ్‌ చేస్తారు.

చెవుడు తెప్పించే డీజేలు, ప్రమాదకరమైన లే జర్‌ లైట్ల జోలికి వెళ్లొద్దు. సంస్కృతిని ప్రతిబింబించే మంగళవాయిద్యాలు, డప్పులు, భజనలతో ఊరేగింపులు నిర్వహించాలి.

విగ్రహాన్ని తరలించే మార్గంలో వేలాడే కరెంట్‌ వైర్లు, కేబుల్స్‌ ఉన్నాయా లేదా అన్నది ముందే గమనించాలి. తరలింపు సమయంలో వాహనంపై విద్యుత్‌ రహిత చెక్క కర్రలతో నిపుణులైన వ్యక్తులను మాత్రమే ఉంచాలి.

నిర్లక్ష్యంతో గాల్లో కలుస్తున్న ప్రాణాలు

ఉత్సవాల్లో అపశ్రుతులకు తావివ్వొద్దు

ఊరేగింపుల్లో పొంచివున్న ముప్పు

గణనాథుడి ప్రతిమలు తెచ్చే వేళ

జాగ్రత్తలు పాటించాలి

వినాయక నవరాత్రోత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. ఆగమనం పేరిట నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం డీజేలపై నిషేధం ఉంది. రహదారులపై ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించొ ద్దు. విగ్రహాల తరలింపు వేళ మద్యం సేవించి వాహనాలు నడపడం, ప్రమాదకర స్టంట్లు చేయడం నిషేధం. పోలీసులకు సహకరించాలి. – రాజేశ్‌చంద్ర, ఎస్పీ, కామారెడ్డి

హైదరాబాద్‌లోని రాంనగర్‌ చౌరస్తా వద్ద శనివారం రాత్రి గణేశ్‌ ఆగమనం సందర్భంగా జరిగిన తోపులాటలో బద్రీనాథ్‌ అనే బీటెక్‌ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడు ఇంజినీరై తమను ఆదుకుంటాడనుకున్న ఆ తల్లిదండ్రులకు ఘటన గుండెకోత మిగిల్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement