భారత్‌ గురురత్న అవార్డు అందుకున్న రామకృష్ణ | - | Sakshi
Sakshi News home page

భారత్‌ గురురత్న అవార్డు అందుకున్న రామకృష్ణ

Sep 7 2026 3:02 AM | Updated on Sep 7 2026 3:02 AM

కామారెడ్డి అర్బన్‌ : కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి పీఎంశ్రీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు విజయగిరి రామకృష్ణ హైదరాబాద్‌ శారదా ఎడ్యుకేషనల్‌ సొసైటీ ‘భారత్‌ గురురత్న’ పురస్కారం పొందారు. రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి జి.వివేక్‌వెంకట స్వామి, పాలమూరు విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ జీఎన్‌.శ్రీనివాస్‌, సొసైటీ చైర్మన్‌ పట్నం కమల, మనోహర్‌ చేతుల మీదుగా గురురత్న అవార్డు అందుకున్నారు.

సీపీఎస్‌ రద్దు కోసం ఉద్యమిస్తాం

కామారెడ్డి టౌన్‌ : ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని (ఓపీఎస్‌) పునరుద్ధరించాలని తెలంగాణ స్టేట్‌ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయీస్‌ యూనియన్‌(టీఎస్‌సీపీఎస్‌ఈయూ) నాయకులు డిమాండ్‌ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు కుంట ఎల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్‌ భావే మాట్లాడుతూ.. సీపీఎస్‌ రద్దు కోసం రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ పిలుపు మేరకు నవంబర్‌ 17న జిల్లా కేంద్రంలో తలపెట్టిన ధర్మదీక్షలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆ రోజు సామూహిక సెలవులు పెట్టి నిరసన తెలపాలని స్పష్టం చేశారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చేపూరి చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర కార్యదర్శులు వడ్ల సురేశ్‌, చల్ల సునీల్‌ కుమార్‌, రాష్ట్ర సాహితీ కమిటీ సభ్యులు మధు విజయ్‌వర్ధన్‌, నరసింహారెడ్డితోపాటు జిల్లా, మండల బాధ్యులు పాల్గొన్నారు.

రేపు ఖోఖో రాష్ట్రస్థాయి జట్ల ఎంపిక

కామారెడ్డి అర్బన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఖో ఖో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 8న మంగళవారం ఉదయం 9 గంటలకు కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో ఖేలో ఇండియా ఖోఖో రాష్ట్రస్థాయి పోటీలకు ఉమ్మడి జిల్లా జట్ల ఎంపికలుంటాయని అ సోసియేషన్‌ ప్రతినిధి మధుసూదన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 1 జనవరి, 2008 లే దా తర్వాత పుట్టిన బాలబాలికలు తమ ఆ ధార్‌తో ఎంపికల్లో పాల్గొనాలని సూచించా రు. ఎంపికై న బాలికల, బాలుర జట్లు ఈ నె ల 16,17 తేదీల్లో హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థా యి ఖేలో ఇండియా ఖోఖో పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.

‘దళితులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం’

కామారెడ్డి టౌన్‌ : కాంగ్రెస్‌ ప్రభుత్వం దళితులకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దళితబంధు స్థానంలో తెస్తామన్న అంబేడ్కర్‌ అభయహస్తం కింద రూ.12 లక్షల ఆర్థిక సాయాన్ని 12 మందికై నా ఇచ్చారా అని ప్రశ్నించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.12 లక్షలు అందించాలని డిమాండ్‌ చేస్తూ అక్టోబర్‌లో ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో మహాదీక్ష చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎంఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరు వెంకటేశ్‌, ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కొత్తూరి సాయిలు, నాయకులు దుబ్బాక లక్ష్మీనారాయణ, దామెర రాజేశ్‌, స్వామి, నారాయణ, రవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement