భిక్కనూరు: ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేని ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పిలుపునిచ్చారు. పాలనలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆదివారం భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో గంప గోవర్ధన్‌తోపాటు బీఆర్‌ఎ స్ నాయకులు రోడ్లు ఊడ్చి, పారిశుద్ధ్య పనులు చేప ట్టారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ఇంటింటికి బాకీ కా ర్డులను పంపిణీ చేశారు. అనంతరం గోవర్ధన్ మా ట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా అన్నివర్గాల ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో కనీస వసతులు కల్పించలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్, నాయకులు మహేందర్ రెడ్డి, నల్లవెల్లి అశోక్, భూం రెడ్డి, వెంకట్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, లక్ష్మీనారాయణ, బసవయ్య, నరేశ్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


