● ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బాన్సువాడ రూరల్: చదువే భవిష్యత్తుకు పునాది అని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బాన్సువాడలో గురువారం నిర్వహించిన శ్రీరాం నారాయ ణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ఫ్రెషర్స్‌డే వేడుకకు ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నతస్థాయికి చేరాలని ఆకాంక్షించారు. అంతకు ముందు కళాశాల స్థలదాత దివంగత శ్రీ రాం నారాయణ ఖేడియా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులు ఆటపాటలతో హోరెత్తించారు. ప్రిన్సిపాల్ గంగాధ ర్, వైస్ ప్రిన్సిపాల్ గులాం ముస్తాఫా, నాయకు లు నాగులగామ వెంకన్న, శివదయాల్‌వర్మ, శ్రీనివాస్‌ప్రసాద్, ప్రొఫెసర్ తుకారాం, రెడ్‌క్రాస్ చైర్మన్ కమటాల శ్రీనివాస్‌రెడ్డి, సోమేశ్వర్ సర్పంచ్ వీరేశం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


