‘మోదీ ప్రజా సేవకే అంకితమయ్యారు’ | - | Sakshi
Sakshi News home page

‘మోదీ ప్రజా సేవకే అంకితమయ్యారు’

Sep 4 2026 1:30 AM | Updated on Sep 4 2026 1:30 AM

‘మోదీ ప్రజా సేవకే అంకితమయ్యారు’

కామారెడ్డి టౌన్‌ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాతికేళ్లుగా ప్రజా సేవకే అంకితమై పనిచేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం సేవా సంకల్ప్‌ అభియాన్‌ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు, దేశ ప్రధానిగా 12 ఏళ్లు నిర్విరామంగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా మోదీ ప్రజాసేవలో ఉన్నారన్నారు. ఆయన పుట్టినరోజు 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా ’సేవా సంకల్ప అభియాన్‌’ నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాల్లో బూత్‌ స్థాయి వరకు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement